Rajeev Rayala |
Updated on: Dec 07, 2024 | 1:34 PM
చాలా మంది ముద్దుగుమ్మలు కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మూడింటిలోనూ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది అందాల భామ అనైకా సోటి. ఈ బ్యూటీ తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
అనైకా సోటి 2013లో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సత్య 2 సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. ఈ అమ్మడి అందానికి ఎవైరైన పడిపోవాల్సిందే..
తమిళ్ లో ఈ ముద్దుగుమ్మ 'కావ్య తలైవన్' అనే సినిమా చేసింది. ఆతర్వాత మరోసారి తెలుగులో 365 రోజులు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆతర్వాత తమిళ్ లో కొన్ని సినిమాలు చేసిన ఈ భామ. ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యింది.
చివరిగా అనైకా సోటి ప్లాన్ పన్ని పన్ననుం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ ముద్దుగుమ్మ తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.
అందంలో ఈ చిన్నది అద్బుతమనే చెప్పాలి. ఈ భామకు ఇన్ స్టా గ్రామ్‌లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లను తెగ కవ్విస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.