- Telugu News Photo Gallery Cinema photos Prabhas Kalki and Allu Arjun Pushpa 2 movies competing with promotions
Pushpa 02: డార్లింగ్‌తో పోటీపడుతున్న పుష్ప.. ఫ్యాన్స్ కి పండగే
జూన్‌లో రిలీజ్ అయ్యే మూవీకీ, ఆగస్టుకి సిద్ధమవుతున్న సినిమాకీ మధ్య పోటీ ఉంటుందా? సేమ్ డేట్ కాదు.. సేమ్ మంత్ కాదు... అలాంటప్పుడు పోటీ ఎందుకు ఉంటుంది అంటారా? అలా అనేసుకుంటే ఎలా? ఏమో... పోటీ ఉండొచ్చు కదా... ఆల్రెడీ మొదలైపోయి ఉండొచ్చు కదా... జస్ట్ డార్లింగ్ కల్కి, ఐకాన్ స్టార్ పుష్ప ప్రమోషన్ల మీద ఓ లుక్ వేసేయండి... ప్రమోషన్ల విషయంలో ఎలాంటి పోటీ కనిపిస్తుందో మీకే అర్థమైపోతుంది... ఏవంటారూ... డీటైల్డ్ గా మాట్లాడుకుందామా మరి...
Updated on: May 15, 2024 | 10:11 PM

పుష్ప సినిమా కోసం ప్యాన్ ఇండియా ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తున్నారో సినిమాలో నటించిన నటీనటులు కూడా అంతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రా అండ్ రస్టిక్ లుక్స్ ఉన్న కేరక్టరైజేషన్స్ ఆర్టిస్టులకు కూడా అరుదుగానే అందుతుంటాయి.

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప2. ఫస్ట్ పార్టుతో జబర్దస్త్ హిట్ అందుకున్న పుష్ప టీమ్ ఇప్పుడు సీక్వెల్ మీద స్పెషల్‌గా కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు. అందుకే ముందు నుంచే ప్రమోషన్లను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. వేసే ప్రతి అడుగూ ప్యాన్ ఇండియా వైపే అన్నంత గట్టిగా సాగుతోంది పబ్లిసిటీ.

మరి కల్కి ప్రమోషన్ ముచ్చటేంటి..? ప్రభాస్ ఫ్యాన్స్‌కు మేకర్స్ ఇచ్చే ఆన్సర్ ఏంటి..? ఎట్టి పరిస్థితుల్లో జూన్ 27న కల్కి సినిమా వస్తుంది.. ఈ ముక్క కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు చెప్తూనే ఉన్నారు.

పుష్ప 2 టీంను కొన్ని రోజులుగా వెంటాడుతున్న ప్రశ్నకు సమాధానం దొరికేసిందా..? స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారూ.. ఎవరు చేస్తారనే చర్చ నడుస్తుండగానే.. ఎవరూ ఊహించని విధంగా ఇండియన్ నెంబర్ వన్ ట్రెండింగ్ బ్యూటీని సుకుమార్ లైన్‌లోకి తీసుకొస్తున్నారా..?

కల్కి 2898 AD ప్రమోషన్స్ ఎక్కడ..? వైజయంతి మూవీస్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ నేరుగా అడుగుతున్న ప్రశ్న ఇదే. అసలు ఈ చిత్ర షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? అనుకున్న తేదీకే వస్తుందా లేదంటే ఆలస్యం అవుతుందా..? ఆల్రెడీ మే మధ్యలో ఉన్నాం.. చూస్తుండగానే జూన్ కూడా వచ్చేస్తుంది.




