- Telugu News Photo Gallery Cinema photos High expectations for Double iSmart movie on Ram Pothineni, Puri Jagannadh and Mani sharma
Double iSmart: భారమంతా డబుల్ ఇస్మార్ట్‌పైనే.. ఆ ముగ్గురి కెరీర్స్‌కు అగ్నిపరీక్ష
డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆ ముగ్గురి కెరీర్స్‌కు అగ్నిపరీక్ష పెడుతుందా..? చివరి అవకాశంగా మారనుందా..? వరస ఫ్లాపుల్లో ఉన్న ముగ్గురు స్టార్స్‌కు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చావో రేవో తేల్చబోతుందా..? అసలు ఈ సినిమా ఎలా వస్తుంది..? ప్రతీ సినిమాకు ముందు చేసే హడావిడి ఈ సారి పూరీ ఎందుకు చేయట్లేదు..? టీజర్‌తో డబుల్ ఇస్మార్ట్‌పై అంచనాలు పెరిగాయా..? చూస్తున్నారుగా.. డబుల్ ఇస్మార్ట్ టీజర్..! మరోసారి పూర్తిగా ఇస్మార్ట్ శంకర్ ఫార్ములానే ఫాలో అయిపోయారు పూరీ జగన్నాథ్.
Updated on: May 16, 2024 | 12:01 PM

డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆ ముగ్గురి కెరీర్స్‌కు అగ్నిపరీక్ష పెడుతుందా..? చివరి అవకాశంగా మారనుందా..? వరస ఫ్లాపుల్లో ఉన్న ముగ్గురు స్టార్స్‌కు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చావో రేవో తేల్చబోతుందా..? అసలు ఈ సినిమా ఎలా వస్తుంది..? ప్రతీ సినిమాకు ముందు చేసే హడావిడి ఈ సారి పూరీ ఎందుకు చేయట్లేదు..? టీజర్‌తో డబుల్ ఇస్మార్ట్‌పై అంచనాలు పెరిగాయా..? చూస్తున్నారుగా..

లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ టిల్లు స్క్వేర్ విషయంలో అదే జరిగింది. మరి టీజర్‌తోనే టిల్లు వైబ్స్ ని గుర్తు చేసిన డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి ఏంటి? డబుల్ ఇస్మార్ట్ టీజర్ ఎలా ఉంది అనే డిస్కషన్‌లో రిపీటెడ్‌గా వినిపిస్తున్న మాట ఒకటే.

మేకింగ్ పరంగానూ ఎక్కడా తగ్గేదే లేదన్నట్లు తెరకెక్కిస్తున్నారు పూరీ జగన్నాథ్. డబుల్ ఇస్మార్ట్ టీజర్‌లో మణిశర్మ మ్యాజిక్ మరోసారి మ్యాజిక్ చేసింది. ఇస్మార్ట్ శంకర్ అంత పెద్ద విజయం సాధించిందంటే కారణం మణిశర్మ మాస్ మ్యూజిక్.

సీక్వెల్స్ ఎలా ఉండాలి.? ఆల్రెడీ చెప్పిన కథని కంటిన్యూ చేస్తే సరిపోతుందా.? లేకుంటే థీమ్ మాత్రం తీసుకుని కథలో కొత్తదనాన్ని క్రియేట్ చేసుకోవాలా? వీటన్నిటికీ మించి మరో విషయం ఉంది. అదే కమర్షియల్ సక్సెస్. ఏం చేసినా బొమ్మ బాక్సాఫీస్ దగ్గర దద్దరిల్లాలి. కాసుల వర్షం కురిపించాలి.

చాన్నాళ్లుగా సక్సెస్ లేకుండా ఉన్న అనుష్క కెరీర్‌ని గాడిలో పెట్టిన మహేష్ బాబు, ఇప్పుడు రామ్‌కి కూడా జబర్దస్త్ సక్సెస్ అయ్యే స్క్రిప్ట్ వినిపించారా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్..




