- Telugu News Photo Gallery Cinema photos Prabhas Kalki 2898 AD to Raja Saab latest movie shooting updates from tollywood film industry
Telugu Films: టాలీవుడ్ లో షూటింగ్ ల సంబరం.. ఎవరు ఏమి చేస్తున్నారంటే.?
అమెరికా నుంచి వచ్చీ రాగానే చిరంజీవి విశ్వంభరతో బిజీ అయిపోయారు.. గేమ్ ఛేంజర్ కూడా సూపర్ ఫాస్టుగా జరుగుతుంది.. సంక్రాంతి హీరోలు మాత్రం ఇంకొన్ని రోజులు బ్రేక్ తీసుకునేలా కనిపిస్తున్నారు.. ఎన్నికల కోసం బాలయ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు.. ఇలా ఒక్కొక్కరి గురించి ఎందుకు గానీ.. షూటింగ్ అప్‌డేట్స్ అన్నీ ఒకే స్టోరీలో చూద్దాం పదండి..
Updated on: Feb 28, 2024 | 1:42 PM

తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత మళ్లీ షూటింగ్స్ కళ గట్టిగా కనిపిస్తుంది. సంక్రాంతి పండక్కి వచ్చిన మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జునను పక్కనబెడితే.. మిగిలిన వాళ్లంతా బిజీగానే ఉన్నారు.

ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా షూటింగ్ శంకరపల్లిలో డబల్ స్పీడ్ తో నడుస్తుంది. ఈ చిత్రం మే 9న పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ షూటింగ్ శంషాబాద్‌లో జరుగుతున్నాయి.

అమెరికా నుంచి వచ్చీ రాగానే విశ్వంభర సెట్‌లో అడుగు పెట్టారు చిరంజీవి. ఈ చిత్ర షూటింగ్ మోఖిల్లాలో జరుగుతుంది. ఇందులో త్రిష హీరోయిన్. బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ సోసియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఎన్టీఆర్ ఉన్నా లేకపోయినా.. దేవర షూటింగ్ ఆపట్లేదు కొరటాల. ఈ చిత్ర షూట్ శంషాబాద్‌లో జరుగుతుంది. గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్‌తో పాటు అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇక అక్కడే రవితేజ, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్.. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ లేటెస్ట్ షెడ్యూల్స్ జరుగుతున్నాయి.

నాని కూడా సరిపోదా శనివారం షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ షూటింగ్ కూకట్‌పల్లి నుంచి చెన్నైకి షిఫ్ట్ అయింది. అడివి శేష్ గూఢాచారి 2 షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఎన్నికల కారణంగా బాలయ్య, బాబీ సినిమాకు బ్రేక్ పడేలా కనిపిస్తుంది.




