- Telugu News Photo Gallery Cinema photos Power Star Pawan Kalyan Shooting postpone due to election moment Telugu Heroes Photos
Pawan Kalyan: అన్నీ ఎన్నికల తర్వాతే..! షూటింగ్స్ బ్రేక్ వేసిన పవన్ కళ్యాణ్..
కొత్తగా ఏమైంది.. అనుకున్నదేగా అయింది.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమాలు కమిటైన దర్శక నిర్మాతలు మనసులో అనుకుంటున్న మాట ఇదే అయ్యుండొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటికీ పరిష్కారం చూపించారు PK. మరి ఆయన తీసుకున్న నిర్ణయమేంటి..? ఎలక్షన్స్ కారణంగా పవన్ సినిమాలు ఆగిపోతున్నాయా..? ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే.. కోరి కోరి కొరివితో తల గోక్కోవడమే అవుతుంది.
Updated on: Nov 18, 2023 | 2:18 PM

కొత్తగా ఏమైంది.. అనుకున్నదేగా అయింది.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమాలు కమిటైన దర్శక నిర్మాతలు మనసులో అనుకుంటున్న మాట ఇదే అయ్యుండొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటికీ పరిష్కారం చూపించారు PK.

మరి ఆయన తీసుకున్న నిర్ణయమేంటి..? ఎలక్షన్స్ కారణంగా పవన్ సినిమాలు ఆగిపోతున్నాయా..? ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే.. కోరి కోరి కొరివితో తల గోక్కోవడమే అవుతుంది.

పాపం ఆయనెంత సీరియస్‌గా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేద్దామని ప్రయత్నిస్తున్నా.. పరిస్థితులు మాత్రం అస్సలు సహకరించడం లేదు. పట్టుమని 10 రోజులు డేట్స్ ఇవ్వగానే.. ఏదో ఓ ఉపద్రవం వచ్చి పడుతుంది.

దాంతో ఎన్నికలయ్యేంత వరకు ఈ సినిమాలేం వద్దనే నిర్ణయానికి వచ్చేసారు పవన్. ఓజి అయిపోతుంది.. ఉస్తాద్ అయిపోవస్తుంది.. హరిహర వీరమల్లు అవుతుందంటూ ఇన్నాళ్ళూ సోషల్ మీడియాలో చర్చలు బాగానే జరిగాయి.

కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎలక్షన్ పూర్తయ్యే వరకు నో మూవీస్ అంటున్నారు పవన్. ఈ క్రమంలోనే క్రిష్ మరో హీరో కోసం చూస్తున్నారు. ఇప్పుడు హరీష్ శంకర్ సైతం రవితేజతో సినిమా కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఉస్తాద్‌ను ప్రస్తుతానికి పక్కనబెట్టి అన్నపూర్ణ స్టూడియోస్‌లో రవితేజ సినిమా కోసం టెస్ట్ షూట్ మొదలుపెట్టారు హరీష్ శంకర్. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టి.. సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.

ఆఫ్టర్ ఎలక్షన్స్ ఉస్తాద్ మళ్లీ సెట్స్‌పైకి రానుంది. సుజీత్ ఓజి పరిస్థితి కూడా ఇంతే. మొత్తానికి ఇతర సినిమాలు చేసుకొమ్మని పవన్ తన దర్శకులకు అనుమతి అయితే ఇచ్చేసారు. మరి ఎవరేం చేస్తారో చూడాలిక.




