- Telugu News Photo Gallery Cinema photos Pooja Hegde's Comeback Fighting for a Second Inning in Tollywood
Pooja Hegde: సెకండ్ ఇన్నింగ్స్ లో సెగలు రేపుతానంటున్న సీనియర్ బ్యూటీ
సెకండ్ ఛాన్స్ కోసం.. సెకండ్ ఇన్నింగ్స్ కోసం సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఓ బ్యూటీ. ఒక్కసారి పడితే మళ్ళీ పుంజుకోవడం కష్టం. ఇప్పుడున్న పోటీలో హీరోయిన్లు రెండేళ్లు కనబడకపోతే ఇంక అంతే. ఈ పోటీలో కూడా తన లక్ పరీక్షించుకుంటున్నారు ఓ బ్యూటీ. మరోసారి సత్తా చూపించాలని వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇంతకీ ఎవరా సీనియర్ హీరోయిన్..?
Updated on: Aug 09, 2025 | 9:25 PM

ఓ టైమ్‌లో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే.. ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు. హీరోయిన్‌గా కమిటైన పూరీ జగన్నాథ్ జనగణమనతో పాటు గాంజా శంకర్ సినిమాలు ఆగిపోవడం.. కార్తిక్ దండు, చైతూ సినిమా నుంచి తప్పించడంతో పూజా కెరీర్ తెలుగులో పూర్తిగా గాడి తప్పింది.

టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో తమిళం, హిందీపై ఫోకస్ చేస్తున్నారు పూజా. ఈ మధ్యే తమిళంలో సూర్యతో నటించిన రెట్రో డిజాస్టర్ కావడం పూజాకు మరో దెబ్బ. తను గ్యాప్ తీసుకోలేదని.. అలా వచ్చిందంటున్నారు ఈ బ్యూటీ.

తెలుగులో ఈ మధ్యే ఓ సినిమా సైన్ చేసారు పూజా. దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమా చేస్తున్నారు.. ఈ మధ్యే సినిమా మొదలైంది. తమిళంలో చాలా బిజీగా ఉన్నారు పూజా. రజినీకాంత్ కూలీ, విజయ్ జన నాయగన్ సినిమాల్లోనూ నటిస్తున్నారు.

వీటితో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీలోనూ ఆఫర్స్ పర్లేదు. తెలుగులో ఒక్కటంటే ఒకే సినిమా చేతిలో ఉంది.. మరో రెండు చర్చల దశలో ఉన్నాయి. అందులో ఒకటిప్పుడు ఫైనల్ అయ్యేలా కనిపిస్తుంది.

విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ స్పోర్ట్స్ డ్రామా రెడీ అవుతుంది. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇష్క్ తర్వాత విక్రమ్, నితిన్ కాంబినేషన్‌లో రానున్న సినిమా ఇది. దుల్కర్ సల్మాన్, నితిన్ సినిమాలతో మరోసారి తెలుగులో బిజీ అవ్వాలని చూస్తున్నారు పూజా.




