- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress rukshar dhillon shared her latest cute photos
Tollywood : రచ్చ లేపిన రుక్సార్ ధిల్లన్.. ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
టాలీవుడ్‌లో ఎంతో మంది కుర్ర హీరోయిన్స్ తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో రుక్సార్ ధిల్లన్ ఒకరు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ.ఈ సినిమాతో ఈ చిన్నదానికి మంచి మార్కులు పడ్డాయి.
Updated on: Aug 09, 2025 | 10:00 PM

టాలీవుడ్‌లో ఎంతో మంది కుర్ర హీరోయిన్స్ తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో రుక్సార్ ధిల్లన్ ఒకరు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ.ఈ సినిమాతో ఈ చిన్నదానికి మంచి మార్కులు పడ్డాయి.

ఈ సినిమాలో అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ వయ్యారి భామ. కృష్ణార్జున యుద్ధం సినిమాకంటే ముందు ఆకతాయి అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ సినిమాలో నటించి మెప్పించింది రుక్సార్ ధిల్లన్. తన అందంతో కవ్వించింది రుక్సార్.

ఆతర్వాత విశ్వక్ సేన్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత స్పార్క్ సినిమాలో నటించి మెప్పించింది ఈ అందాల భామ. అయితే ఈ చిన్నది సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోయింది.

దాంతో పాటు ఇప్పుడు ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దాంతో సినిమాల పరంగా ఈ చిన్నది ఎక్కడ కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో దుమారం రేపుతోంది. ఈ కుర్రదాని ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలు వదిలింది. ఆ ఫోటోలు ఇప్పుడు కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్నాయి. అలాగే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.