- Telugu News Photo Gallery Cinema photos Pawan kalyan Harihara Veeramallu movie latest update on 07 03 2025
Harihara Veeramallu:పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు నుంచి కీలక అప్ డేట్
ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ప్రస్తుతం ఈ పాటే పాడుకుంటున్నారు వీరమల్లు మేకర్స్. ఎప్పట్నుంచో ఈ సినిమాను పూర్తి చేయాలని కలలు కంటున్నారు దర్శక నిర్మాతలు. చివరికి వాళ్ల కల నెరవేరే రోజు రానే వచ్చింది. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ మొదలైంది. ఇంతకీ హరిహర వీరమల్లు షూటింగ్ అప్డేట్ ఏంటి..? పవన్ ఎప్పుడొస్తున్నారు..? చెప్పిన టైమ్‌కు రిలీజ్ అవుతుందా..?
Updated on: Mar 07, 2025 | 7:55 PM

పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మాట వినడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోతుంది దర్శక నిర్మాతలకు. ఆయన చెప్పినట్లే చేస్తున్నా కూడా షూటింగ్స్ అనుకున్న సమయానికి జరగట్లేదు. ఆయనున్న బిజీకి డేట్స్ ఇవ్వడం బాగా కష్టమైపోతుంది. ఇన్ని టెన్షన్స్‌లోనూ హరిహర వీరమల్లుకు డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు పవన్. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది.

4 రోజులు.. నాలుగంటే రోజులు పవన్ కల్యాణ్ డేట్స్ ఇస్తే చాలు షూటింగ్ అంతా అయిపోతుంది. మేకర్స్ కూడా దీనికోసమే ఎప్పటినుంచో వేచి చూస్తున్నారు. ప్రస్తతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగుతున్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కూడా అసెంబ్లీలోనే ఉన్నారు. అందుకే డేట్స్ ఇవ్వలేకపోతున్నారీయన. ఈ సమావేశాలు పూర్తవ్వగానే వస్తానని మాటిచ్చారు పవన్.

ఇప్పటికే హరిహర వీరమల్లు ఫస్టాఫ్ అంతా పూర్తైపోయింది.. సెకండాఫ్‌లో మాత్రం పవన్‌పై కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అవి పూర్తైపోతే.. పోస్ట్ ప్రొడక్షన్ చేసి సినిమా విడుదల చేయడమే ఆలస్యం.

ప్రస్తుతం తాడేపల్లి సమీపంలో సత్యరాజ్, ఈశ్వరి రావుపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే గండికోటలోని మాధవరాయ స్వామి ఆలయంలో శివాలయం సెట్ వేసి సీన్స్ షూట్ చేసారు.

మార్చి 28న హరిహర వీరమల్లు విడుదల చేస్తామంటున్నారు కానీ ఆ డేట్‌కు రావడం కష్టమే. అసెంబ్లీ సమావేశాలు మార్చి మూడో వారం వరకు జరగనున్నాయి. ఆ తర్వాత పవన్ వస్తే.. షూట్ పూర్తి చేసి విడుదల చేయడం కష్టమే. అయితే మార్చి 28న మిస్సైనా.. ఎప్రిల్‌లో సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?




