- Telugu News Photo Gallery Cinema photos Battle between Rashmika Mandanna and Deepika Padukone in Bollywood to be top
బాలీవుడ్‌లో రష్మిక, దీపిక మధ్య సమరం.. నేనంటే నేనటున్న ముద్దుగుమ్మలు
ఎదురే నాకు లేదు.. నన్నెవరూ ఆపలేరు అంటూ కొదమసింహంలో చిరంజీవి స్టైల్‌లో దూసుకుపోతున్నారు దీపిక పదుకొనే. బాలీవుడ్‌లో ఈమె జోరును అడ్డుకునే భామే లేదు.. కానీ ఇప్పుడు నేనున్నాను అంటూ వచ్చేసారు రష్మిక మందన్న. బాక్సాఫీస్ లెక్కల దగ్గర ఈ ఇద్దరు బ్యూటీస్ మధ్య అదిరిపోయే వార్ జరుగుతుంది. మరి అదేంటో మనమూ చూసేద్దామా..?
Updated on: Mar 07, 2025 | 7:45 PM

ఇటు విజయాలు.. అటు వివాదాలు రెండూ ఎంజాయ్ చేస్తున్నారు రష్మిక మందన్న. ఈమె ప్రస్తుతం గోల్డెన్ లెగ్ కాదు.. ఏకంగా డైమండ్ లెగ్ అయిపోయింది. అడుగేస్తే 500 కోట్లు.. వర్కవుట్ అయితే 1000 కోట్లు అన్నట్లుంది ఇప్పుడు ఈ భామ జోరు. గత ఏడాదిగా బాలీవుడ్‌ను రూల్ చేస్తున్నారు రష్మిక మందన్న. ఈమె కంటే ముందు దీపిక ఈ ప్లేస్‌లో ఉండేది.

బాలీవుడ్‌లో అత్యధిక 500 కోట్ల సినిమాల రికార్డ్ ఇన్నాళ్లూ దీపిక పదుకొనే దగ్గరే ఉంది. 2023లో ఈమె నటించిన పఠాన్, జవాన్ సినిమాలు కేవలం హిందీలోనే 500 కోట్లకు పైగా వసూలు చేసాయి.

ఇప్పుడీ రికార్డ్ రష్మిక బద్ధలు కొట్టేసారు. పుష్ప 2, యానిమల్ సినిమాలు హిందీలో 500 కోట్లకు పైగానే వసూలు చేసాయి.. తాజాగా ఛావాతో మూడో 500 కోట్ల వైపు అడుగేస్తున్నారు ఈ బ్యూటీ.

దీపికా పదుకొనే ప్రస్తుతం ఒకప్పటి జోరు చూపించట్లేదు. కల్కి 2 మాత్రమే కమిటయ్యారు. కానీ రష్మిక చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రంజాన్‌కు సల్మాన్ ఖాన్‌తో నటిస్తున్న సికిందర్ విడుదల కానుంది.

ఇది హిట్టైతే నాలుగో సారి 500 కోట్ల క్లబ్‌లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలా చూసుకున్నా.. రాబోయే రెండేళ్ల వరకు బాలీవుడ్ పగ్గాలు రష్మిక చేతుల్లోనే కనిపిస్తున్నాయి.




