- Telugu News Photo Gallery Cinema photos On occasion of his Brahmanandam Birthday, OTT movie titled VVY and poster released
Brahmanandam: పుట్టిన రోజున గుడ్ న్యూస్.. ఓటీటీలోకి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం
టాలీవుడ్ లో కామెడీ కింగ్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు బ్రహ్మానందం.. కామెడీతోనే కాదు హావభావాలతో ప్రేక్షకులను నవ్వించగలరు బ్రహ్మానందం. నేడు ఈ కామెడీ లెజెండ్ పుట్టిన రోజు. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు బ్రహ్మానందం.
Updated on: Feb 01, 2024 | 2:35 PM

టాలీవుడ్ లో కామెడీ కింగ్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు బ్రహ్మానందం.. కామెడీతోనే కాదు హావభావాలతో ప్రేక్షకులను నవ్వించగలరు బ్రహ్మానందం.

నేడు ఈ కామెడీ లెజెండ్ పుట్టిన రోజు. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు బ్రహ్మానందం.

ఆహనా పెళ్ళంట అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు బ్రహ్మానందం. బ్రహ్మానందం కోసమే సినిమాలకు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు.

ఇప్పటి యూత్ లోనూ బ్రహ్మానందం కు మంచి క్రేజ్ ఉంది.. సినిమాలు తగ్గించినప్పటికీ మీమ్స్ ద్వారా బ్రహ్మానందం పేరు వైరల్ అవుతూనే ఉంది.

ఇటీవలే రంగస్థలం సినిమాలో సీరియస్ రోల్ లో నటించి మెప్పించారు బ్రహ్మానందం. అలాగే కీడకోలా సినిమాలో నటించారు.

ఇక ఇప్పుడు ఓటీటీలో కి ఎంట్రీ ఇస్తున్నారు బ్రహ్మానందం. బ్రహ్మానందం ఓటీటీ ఎంట్రీ మూవీ టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు వీవీవై అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఈటివి విన్ లో జూలై 18న రిలీజ్ కాబోతోంది.




