- Telugu News Photo Gallery Cinema photos Hero Ram Charan Controversy on his next Movie Game Changer Update on 2024 Telugu Heroes Photos
Ram Charan: మళ్లీ డిస్సపాయింట్.! పాపం.. చిరంజీవి, పవన్ మధ్య నలిగిపోతున్న రామ్ చరణ్.
ఇటు చూస్తే నాన్న.. అటు చూస్తే బాబాయ్.. ఎవరికీ ఎదురెళ్లలేడు.. అలాగని ఇద్దరికీ నో చెప్పలేడు.. పాపం అటు ఇటు కాకుండా మధ్యలో నలిగిపోతున్నారు రామ్ చరణ్. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయకపోవడం మెగా వారసుడికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. చిరంజీవి, పవన్ మధ్య నలిగిపోతున్న గేమ్ ఛేంజర్ అసలు 2024లో వస్తుందా..? అందరు సినిమాల రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అవుతున్నాయి.. కానీ గేమ్ ఛేంజర్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది.
Updated on: Feb 01, 2024 | 1:55 PM

ఇటు చూస్తే నాన్న.. అటు చూస్తే బాబాయ్.. ఎవరికీ ఎదురెళ్లలేడు.. అలాగని ఇద్దరికీ నో చెప్పలేడు.. పాపం అటు ఇటు కాకుండా మధ్యలో నలిగిపోతున్నారు రామ్ చరణ్. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయకపోవడం మెగా వారసుడికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది.

చిరంజీవి, పవన్ మధ్య నలిగిపోతున్న గేమ్ ఛేంజర్ అసలు 2024లో వస్తుందా..? అందరు సినిమాల రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అవుతున్నాయి.. కానీ గేమ్ ఛేంజర్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది.

చివరికి నిన్నగాక మొన్న షూటింగ్ మొదలైన చిరంజీవి లేటెస్ట్ సినిమా విశ్వంభరను కూడా సంక్రాంతి 2025కి విడుదల చేస్తామని చెప్పారు నిర్మాతలు.. కానీ ఎప్పుడో మొదలైన చరణ్ సినిమా రిలీజ్ డేట్‌పై ఈ క్లారిటీ లేకుండా పోయింది.

2021లో గేమ్ ఛేంజర్‌కు కొబ్బరికాయ్ కొట్టారు. 2023లో విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఆగిపోయిన ఇండియన్ 2 మళ్లీ పట్టాలెక్కడంతో ప్లాన్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యాయి. ఇప్పటికీ గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి కాలేదు.

రిలీజ్ డేట్ చెప్పమంటే నిర్మాత దిల్ రాజు సైతం కన్ఫ్యూజన్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందిప్పుడు. సెప్టెంబర్ 2024 అంటున్నా.. అప్పుడైనా వచ్చేనా అనే డౌట్స్ లేకపోలేదు. సెప్టెంబర్‌లో గేమ్ ఛేంజర్ విడుదల చేద్దామనుకుంటే.. ఓజి రూపంలో పెద్ద షాకే తగిలింది.

సెప్టెంబర్ 27న OG సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. అంటే గేమ్ ఛేంజర్‌కు ఆ సీజన్ మిస్ అయినట్లే. అక్టోబర్ 12న దసరా. అప్పుడు కానీ చరణ్ సినిమా రాలేదంటే మళ్లీ 2025 సమ్మర్ వరకు రిలీజ్ డేట్స్ దొరకవు.

ఎందుకంటే సంక్రాంతికి ఆల్రెడీ చిరంజీవి రేసులో ఉన్నారు. అక్టోబర్ మిస్సైతే.. డిసెంబర్ ఉంటుంది.. కానీ పుష్ప 2 ఒకవేళ ఆగస్ట్ 15న రాకపోతే డిసెంబర్‌లోనే రావడం ఖాయం. అంటే గేమ్ ఛేంజర్‌కి ఛాన్స్ లేదు.

సంక్రాంతికి విశ్వంభర ఉంది కాబట్టి నాన్నతో పోటీకి రాడు. అప్పుడిక చరణ్‌కు సమ్మర్ ఒక్కటే ఆప్షన్ అవుతుంది. అలా కాకుండా ఓజి వచ్చిన 15 రోజుల్లోనే.. దసరాకు గేమ్ ఛేంజర్ విడుదల చేస్తే ఆల్ హ్యాపీస్..! లేదంటే చిరు, పవన్ మధ్య చరణ్‌కు స్యాండ్ విజ్ తప్పదు.




