- Telugu News Photo Gallery Cinema photos Heroine Urvashi Rautela powerful role in Tollywood NBK new movie Telugu Actress Photos
Urvashi Rautela: బాలయ్య, బాబీ సినిమాలో హీరోయిన్ గా పార్టీ బ్యూటీ ఊర్వశి రౌటెలా.
బాలయ్య, బాబీ సినిమాలో హీరోయిన్ ఎవరు..? కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీనిపై చర్చ బాగానే జరుగుతుంది. వాళ్లు వీళ్ళు అంటూ కొన్నిపేర్లు వినిపించాయే కానీ ఎవరి పేరు అయితే కన్ఫర్మ్ కాలేదు. కానీ ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది. చిరంజీవి హీరోయిన్‌తోనే జోడీ కట్టబోతున్నారు NBK. మరి ఇంతకీ ఎవరా బ్యూటీ..? బాలయ్య సినిమాలో ఆమె కారెక్టర్ ఏంటి.? ఒకప్పట్లా బాలయ్య సినిమాల్లో స్టార్ హీరోయిన్లు ఇప్పుడు నటించట్లేదు.
Updated on: Feb 01, 2024 | 1:56 PM

బాలయ్య, బాబీ సినిమాలో హీరోయిన్ ఎవరు..? కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీనిపై చర్చ బాగానే జరుగుతుంది. వాళ్లు వీళ్ళు అంటూ కొన్నిపేర్లు వినిపించాయే కానీ ఎవరి పేరు అయితే కన్ఫర్మ్ కాలేదు.

కానీ ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది. చిరంజీవి హీరోయిన్‌తోనే జోడీ కట్టబోతున్నారు NBK. మరి ఇంతకీ ఎవరా బ్యూటీ..? బాలయ్య సినిమాలో ఆమె కారెక్టర్ ఏంటి.? ఒకప్పట్లా బాలయ్య సినిమాల్లో స్టార్ హీరోయిన్లు ఇప్పుడు నటించట్లేదు.

అప్పుడప్పుడూ మినహాయిస్తే.. కొన్నేళ్లుగా అప్‌కమింగ్ హీరోయిన్లతోనే నటిస్తున్నారు NBK. గతేడాది వీరసింహారెడ్డిలో శృతి హాసన్.. భగవంత్ కేసరిలో కాజల్‌తో జోడీ కట్టారు బాలయ్య.

అయితే రెండు సినిమాల్లోనూ హీరోయిన్ ట్రాక్‌కు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు.. ఫోకస్ అంతా బాలయ్యపైనే ఉంటుంది. వరస విజయాలతో జోరు మీదున్న బాలయ్య.. ప్రస్తుతం బాబీ సినిమాతో బిజీగా ఉన్నారు.

80స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాఫియా కథ ఇది. ఇందులో బాలయ్యకు జోడీగా ఎవరు నటిస్తున్నారనే విషయంపై కొన్నాళ్లుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. సీనియర్ హీరోయిన్ శ్రీయతో పాటు సైంధవ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ పేర్లు తెరపైకి వచ్చాయి.

కానీ చివరికి బాస్ పార్టీ బ్యూటీ ఊర్వశి రౌతెలాకు ఓటేసారు మేకర్స్. వాల్తేరు వీరయ్యలో ఊర్వశి రౌతెలాతో స్పెషల్ సాంగ్ చేయించిన బాబీ.. NBK 109లో హీరోయిన్‌గా తీసుకున్నారు.

ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు ఊర్వశి. ఈ కారెక్టర్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ భామ.

బ్రో, స్కంద, ఏజెంట్, వాల్తేరు వీరయ్యలలో స్పెషల్ సాంగ్స్‌తో క్రేజ్ తెచ్చుకున్న ఊర్వశి.. ఫస్ట్ టైమ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరి బాలయ్య సినిమాతో ఈమె జాతకం ఎలా మారుతుందో చూడాలి.




