- Telugu News Photo Gallery Cinema photos NTR NEEL Movie Shooting Update and NTR Dragon Movie release date 09 January 2024 Telugu Heroes Photos
NTR NEEL: ఎన్టీఆర్ అదొక్కటీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు.? పాన్ ఇండియా హీరో అయ్యాక మారాడా..
హమ్మయ్యా..! పైకి చెప్పట్లేదు కానీ ఎన్టీఆర్ అభిమానుల ఇన్నర్ ఫీలింగ్ ఇదే ఇప్పుడు. ఎన్నో రోజుల నుంచి ప్రశాంత్ నీల్ సినిమా ఉందంటున్నారు కానీ దీనిపై అప్‌డేట్స్ లేవు. అసలు ఓ టైమ్‌లో ఉందో ఆగిందో అనే డౌట్స్ వచ్చాయి కూడా. అన్నింటికీ సమాధానం ఇప్పుడొచ్చింది. పూజ అయితే చేసారు.. మరి రెగ్యులర్ షూట్ ముచ్చటేంటి..? మిగిలిన సినిమాల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు.? దేవర షూటింగ్‌తోనే కొన్ని రోజులుగా బిజీ బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్.
Anil kumar poka | Edited By: Ram Naramaneni
Updated on: Aug 11, 2024 | 10:29 PM

అయితే తారక్ మాత్రం రెండు నెలల పాటు మేకోవర్‌కి టైమ్ తీసుకుని డిసెంబర్‌లో నీల్ సెట్స్ కి హాజరు కానున్నారు. అంతలో వార్2 పనులు, కొత్త కథలు వినే పనులు కంప్లీట్ చేసేయాలనే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు.

యూరప్, బల్గేరియా సమీపంలోని బ్లాక్ సీ దగ్గరే ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. కేజియఫ్, సలార్‌కు భిన్నంగా ఎన్టీఆర్ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది. యాక్షన్ పార్ట్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్ హెవీగా ఉండబోతుందని.. రెండు భాగాలుగా ఈ సినిమా రానుందని ప్రచారం జరుగుతుంది.

కాకపోతే కొన్నిసార్లు అవి జనాల్లోకి వస్తాయి.. మరికొన్ని సార్లు రావు.. అంతే తేడా.. లేటెస్ట్ గా ఎన్టీఆర్ టైమ్ స్పెండ్ చేయబోయే విధానం మాత్రం పాపులర్ అవుతోంది.

ఈ రెండింటిపైనే తారక్ ఫోకస్ ఉందిప్పుడు. దేవర, వార్ 2తోనే బిజీగా ఉన్న తారక్.. తాజాగా ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మొదలు పెట్టారు. అప్పుడెప్పుడో ట్రిపుల్ ఆర్ విడుదలకు ముందే నీల్ సినిమాపై ప్రకటన వచ్చింది.

వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ నార్త్ అండ్ సౌత్ ప్రాజెక్టులతో బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్. పనిలో పనిగా మరిన్ని కథలు వినాలన్నది కూడా ఆయన విష్.

అది నిజమే అయితే గనక.. ఇకపై నల్ల సముద్రం అనే మాట చాలాసార్లు వింటారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్నారు. అదేంటి యాంకర్ పార్ట్‌లోనేమో నల్ల సముద్రం అని.. ఇక్కడేమో ఎన్టీఆర్, వార్ 2 అంటూ ఏదేదో చెప్తున్నారు అనుకుంటున్నారా..?

మరోవైపు సలార్ 2 కంటే ముందే మారుతి, హను రాఘవపూడి సినిమాలు.. కుదిర్తే సందీప్ వంగా స్పిరిట్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు. ప్రభాస్ ఒకవేళ అక్కడ లాక్ అయితే.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు లైన్ క్లియర్ అయినట్లే.

దేవర 2తో పాటు నీల్ సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేస్తారు జూనియర్. జనవరి 9, 2026న తారక్, నీల్ సినిమా రిలీజ్ కానుంది. ఇది జరగాలంటే 2025లోనే షూట్ మొదలు కావాలి. మొత్తానికి చూడాలిక.. ఈ ఇద్దరి ప్లానింగ్ ఎలా ఉండబోతుందో.?





























