Actor Nani: ‘హాయ్ నాన్న’ ప్రమోషన్లలో నాని.. కూల్ అండ్ స్టైలీష్ లుక్లో న్యాచురల్ స్టార్..
న్యాచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన సినిమా హాయ్ నాన్న. ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహించారు. తండ్రి కూతుళ్ల మధ్య బంధం, లవ్ స్టోరీ ప్రధాన అంశలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 7న అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా హాయ్ నాన్న ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రచార కార్యక్రమాలు చేస్తూ అడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో నాని షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.