Anil Ravipudi: చిరంజీవితో అలాంటి సినిమా ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి..
తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత వరస విజయాలు అందుకుంటున్న ఒకే ఒక్క దర్శకుడు అనిల్ రావిపూడి. మనోడి నుంచి ఏకంగా 7 సినిమాలు వచ్చాయి.. అన్నీ నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చాయి. ఎఫ్ 3 మాత్రమే కాస్త అటూ ఇటూ అయింది కానీ అది కూడా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక మొన్న దసరాకు విడుదలైన భగవంత్ కేసరి కూడా విజయం అందుకుంది. నిజానికి ఇది అనిల్ రావిపూడి మార్క్ సినిమా కాదు.. తన సేఫ్ జోన్ నుంచి పూర్తిగా బయటికి వచ్చి చేసిన ప్రయోగం. బాలయ్య లాంటి హీరో సినిమాలో ఉన్నా.. ఎక్కడా డైలాగ్స్ ఓవర్‌గా ఉండవు.. డాన్సులు ఉండవు.. పాటలు లేవు.. కామెడీ సీన్స్ లేవు.. అన్నీ పక్కనబెట్టి సిన్సియర్‌గా ఓ కథ చెప్పాడు అనిల్.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
