తెలుగులోనూ దాదాపు 30 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది కాంతార. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం కర్ణాటకలోని భూత కోల సంప్రదాయ నేపథ్యంలో వచ్చింది. కాంతారతో రిషబ్ శెట్టి పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. గతేడాదే 'కాంతార-2' కూడా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం దీని షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా టీజర్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు.
అందులో రిషభ్ గెటప్, సెటప్ అంతా మారిపోయింది. ఆ లుక్ చూస్తుంటేనే బొమ్మ బ్లాక్‌బస్టర్ అని అర్థమైపోతుంది.