- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna, Shruti Haasan, Mrunal Thakur are saying yes to mother's characters on screen
ఆన్‌స్క్రీన్‌పై తల్లి క్యారెక్టర్లకు ఓకే చెబుతోన్న బ్యూటీస్..
పెళ్లీ పిల్లలు, ఇవన్నీ ఎవరి లైఫ్‌లో ఉండవో చెప్పండి. అందరి జీవితాల్లోనూ ఎప్పుడో ఓ సమయంలో చూసేవేగా... అలాంటప్పుడు ఆ విషయాల మీద ఫ్లడ్ లైట్లు వేసి, ఫోకస్ చేయడం ఎందుకు అని అంటున్నారు మన నాయికలు. ఆఫ్ స్క్రీనే కాదు, ఆన్‌స్క్రీన్ కూడా మెడలో నల్లపూసలకు, పక్కన పిల్లలకు ఓకే చెప్పేస్తున్నారు అందాల భామలు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు శ్రీవల్లి లాంటి కేరక్టర్లను కూడా ఇష్టంగా చేస్తున్నారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Nov 29, 2023 | 2:55 PM

పెళ్లీ పిల్లలు, ఇవన్నీ ఎవరి లైఫ్‌లో ఉండవో చెప్పండి. అందరి జీవితాల్లోనూ ఎప్పుడో ఓ సమయంలో చూసేవేగా... అలాంటప్పుడు ఆ విషయాల మీద ఫ్లడ్ లైట్లు వేసి, ఫోకస్ చేయడం ఎందుకు అని అంటున్నారు మన నాయికలు. ఆఫ్ స్క్రీనే కాదు, ఆన్‌స్క్రీన్ కూడా మెడలో నల్లపూసలకు, పక్కన పిల్లలకు ఓకే చెప్పేస్తున్నారు అందాల భామలు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు శ్రీవల్లి లాంటి కేరక్టర్లను కూడా ఇష్టంగా చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ గా నటించిన సినిమా యానిమల్. ఇందులో హీరోని, అతని ఫ్యామిలీ కన్నా ఎక్కువగా అర్థం చేసుకున్న ఇల్లాలిగా నటించారు రష్మిక. అంతే కాదు, ఇందులో పిల్లల తల్లిగానూ కనిపిస్తున్నారు ఈ బ్యూటీ.

శ్రుతిహాసన్ కూడా స్క్రీన్ మీద తల్లిగా చేయడానికి నో చెప్పడం లేదు. ఆల్రెడీ క్రాక్‌లో ఆమె ఓ బాబుకి తల్లిగా నటించారు. ఇప్పుడు హాయ్ నాన్నలోనూ పాపకు తల్లిగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నానిని పెళ్లి చేసుకునే కేరక్టర్ చేస్తున్నారు మృణాల్. ఓ రకంగా ఆమె కూడా పాపకు తల్లిగా కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే.

యంగ్ హీరోయిన్లు ఇప్పుడు ఓకే చెబుతున్నారు గానీ, సమంత లాంటి ఆర్టిస్టులు ఎప్పుడో ఈ కైండ్ రోల్స్ చేసేశారు. మనంలో బాబుకి తల్లిగా చేశారు సమంత. ఆ తర్వాత మజిలీలోనూ నాగచైతన్య కూతురి ఆలనాపాలనా చూసే మారుతల్లి కేరక్టర్‌లో మెప్పించారు సామ్.

నయనతార పిల్లల తల్లిగా చేయడానికి ఎవర్ రెడీ. తెలుగు, తమిళ్, మలయాళం అనే తేడా లేకుండా అన్నీ భాషల్లోనూ పసిపిల్లల తల్లిగా నటించారు. ఎక్కడిదానో ఎందుకు రీసెంట్ హిట్ జవాన్‌లోనూ పాపకు తల్లిగా కనిపించారు. సింగిల్ పేరెంట్‌గా, వర్కింగ్ ఉమన్‌గా ఆమె నటనకు ఫిదా అయ్యారు ఫ్యాన్స్.





























