Hit 3:మనిషా.. రాక్షసుడా..? అలా ఉన్నాడేంటి బాబోయ్..?
హింసకు కొత్త నిర్వచనం చెప్తా.. వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అంటే ఏమో అనుకున్నాం..! కానీ ఇదంతా నాని సీరియస్‌గానే చెప్పారని అర్థమవుతుందిప్పుడు. హిట్ 3 టీజర్ చూస్తుంటే.. వామ్మో అక్కడున్నది నానియేనా అనిపిస్తుంది. టాలీవుడ్‌లో సరికొత్త హింసకు తెరతీసారు న్యాచురల్ స్టార్. మరి ఆ హింసేంటో చూద్దామా..?
Updated on: Feb 25, 2025 | 8:38 PM

చూస్తున్నారుగా నాని హింసను..! ఇది చూసాక.. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అంటూ నాని ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. పక్కింటి అబ్బాయిలా ఉండే న్యాచురల్ స్టార్.. ఇప్పుడు యానిమల్ కంటే వయోలెంట్‌గా మారిపోయారు. హిట్ 3లో హింస ఎక్కువగా ఉంటుందని ముందు నుంచే హింట్ ఇస్తూనే ఉన్నారు నాని.. మనమే ఇంత ఉంటుందనుకోలేదు.

వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది నాని క్యారెక్టర్ ఇందులో. 100 మంది నిర్దోషులు చచ్చినా పర్లేదు కానీ.. ఒక్క నేరస్థుడు మాత్రం తప్పించుకోకూడదు అనుకునేంత మెంటాలిటీ అర్జున్ సర్కార్ సొంతం.

శ్రీనగర్‌లో సీరియల్ హత్యలు జరుగుతుంటాయి.. ఆ కేసును చేధించడానికి ఒక ఆఫీసర్ అవసరం పడుతుంది.. అది అర్జున్ సర్కార్ చేతుల్లోకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.

ఇప్పటి వరకు తెలుగు సినిమాకు ఉన్న వయొలెన్స్ హద్దులన్నీ హిట్ 3తో చెరిపేయాలని ఫిక్సైపోయారు నాని. ఆయన కారెక్టరైజేషన్ నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని అర్థమవుతుంది. అర్జున్ సర్కార్ తనకెప్పటికీ స్పెషల్ అని చాలాసార్లు చెప్పారు నాని. టీజర్ చూసాక.. దాన్నెంత పర్సనల్‌గా తీసుకున్నాడనేది అర్థమవుతుంది.

మే 1న విడుదల కానుంది హిట్ 3. వయొలెన్స్ వర్కవుటైతే బాక్సాఫీస్ దగ్గర నాని ఊచకోత ఖాయం. ఇదే కాదు.. శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న ప్యారడైజ్ ఇంతకంటే వయొలెంట్‌గా ఉంటుందని చెప్తున్నారు నాని. ఈ లెక్కన నాని ఫోకస్ అంతా యాక్షన్ సినిమాలపైనే ఉందని తెలుస్తుంది. సుజీత్, సిబి చక్రవర్తితోనూ మాస్ సినిమాలే చేయబోతున్నారు న్యాచురల్ స్టార్.




