- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna to take temporary break from movies for AP Elections similar to Pawan Kalyan
పవన్ కళ్యాణ్ దారిలోనే.. నేనున్నాను అంటూ వెళ్తున్న బాలయ్య..
మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఒక్కడే.. ఇప్పుడు బాలయ్య కూడా నేనున్నాను అంటున్నారు. దాంతో నిర్మాతలకు టెన్షన్ కాస్తా డబుల్ అయిపోయింది. పాలిటిక్స్ కారణంగా 4 నెలలుగా షూటింగ్స్‌కు దూరంగా ఉన్నారు PK. ఇప్పుడు బాలయ్య ఇదే చేయబోతున్నారు. మరి ఈయన ఎన్ని రోజులు దూరం కానున్నారు..? అదే జరిగితే సెట్స్‌పై ఉన్న బాబీ సినిమా పరిస్థితేంటి..? పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ప్రస్తుతం నిర్మాతలకు కూడా ఓ క్లారిటీ ఉందిప్పుడు.
Updated on: Feb 22, 2024 | 8:34 PM

మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఒక్కడే.. ఇప్పుడు బాలయ్య కూడా నేనున్నాను అంటున్నారు. దాంతో నిర్మాతలకు టెన్షన్ కాస్తా డబుల్ అయిపోయింది. పాలిటిక్స్ కారణంగా 4 నెలలుగా షూటింగ్స్‌కు దూరంగా ఉన్నారు PK. ఇప్పుడు బాలయ్య ఇదే చేయబోతున్నారు. మరి ఈయన ఎన్ని రోజులు దూరం కానున్నారు..? అదే జరిగితే సెట్స్‌పై ఉన్న బాబీ సినిమా పరిస్థితేంటి..?

పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ప్రస్తుతం నిర్మాతలకు కూడా ఓ క్లారిటీ ఉందిప్పుడు. రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయనతో సినిమాలకు కమిటైన దర్శకులు ఇతర ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మరోవైపు పవన్ కూడా తనపై కోట్ల పెట్టుబడి పెట్టిన నిర్మాతల నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నారు. పవన్ ఉన్నా లేకున్నా.. ప్రమోషన్స్ మాత్రం ఆపట్లేదు మేకర్స్.

పవన్ కళ్యాణ్ సంగతి కాసేపు పక్కనబెడితే.. ఇప్పుడు బాలయ్య కూడా ఇదే దారిలో వెళ్లేలా కనిపిస్తున్నారు. ఈయన కూడా సినిమాలతో పాటు రాజకీయాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా బాలయ్య కూడా ప్రచారం కోసం సిద్ధమవుతున్నారు. దీనికోసం 2 నెలలు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు NBK.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వాటిపై ఫుల్ ఫోకస్ పెట్టాలని ఫిక్సైపోయారు బాలయ్య. అందుకే బాబీ సినిమా ప్రస్తుత షెడ్యూల్ అయ్యాక.. కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. మేలోనే మళ్లీ బాలయ్య కెమెరా ముందుకు వస్తారని.. అప్పటి వరకు NBK109కి బ్రేక్ తప్పకపోవచ్చని ప్రచారం జరుగుతుంది.

కొన్ని రోజులుగా జరుగుతున్న నాన్ స్టాప్ షెడ్యూల్స్‌లో బాలయ్య కూడా ఉన్నారు. కానీ ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మునపట్లా కాన్సట్రేట్ చేయడం కష్టమే. అందుకే ముందుగానే దర్శక నిర్మాతలకు విషయం చెప్పి బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు బాలయ్య. ఏదేమైనా ఇటు పవన్ కళ్యాణ్.. అటు బాలయ్య ఇద్దరూ ఆఫ్టర్ ఎలక్షన్స్ మళ్లీ సినిమాల్లో బిజీ కానున్నారు.




