- Telugu News Photo Gallery Cinema photos Shruti Haasan latest black dress photos goes viral in social media telugu movie news
Shruti Haasan : బ్లాక్ డ్రెస్లో మైండ్ బ్లాంక్ చేస్తోన్న శ్రుతి హాసన్.. నెట్టింట ఫోటోస్ వైరల్..
శ్రుతి హాసన్.. కొన్నాళ్లుగా ఈ బ్యూటీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతున్నాయి. క్రాక్ మూవీ నుంచి మొన్నటి సలార్ వరకు అన్ని చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు శ్రుతిహాసన్ ఫుల్ జోష్ మీదుంది. త్వరలోనే సలార్ 2 రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండే శ్రుతిహాసన్.. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. తన ఇన్ స్టా ఖాతాలో ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.
Updated on: Feb 22, 2024 | 9:20 PM

శ్రుతి హాసన్.. కొన్నాళ్లుగా ఈ బ్యూటీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతున్నాయి. క్రాక్ మూవీ నుంచి మొన్నటి సలార్ వరకు అన్ని చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు శ్రుతిహాసన్ ఫుల్ జోష్ మీదుంది. త్వరలోనే సలార్ 2 రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండే శ్రుతిహాసన్.. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. తన ఇన్ స్టా ఖాతాలో ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫోటోస్ నెట్టింట చాలా వైరలవుతున్నాయి.

బ్లాక్ డ్రెస్ ధరించి మైండ్ బ్లాంక్ చేస్తోంది శ్రుతి. బ్లాక్ గ్లామర్ డ్రెస్.. హై బూట్స్ ధరించి హాలీవుడ్ బ్యూటీ రేంజ్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రుతిహాసన్ అడివి శేష్ తో కలిసి డకోయిట్.. ఏ లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తుంది. అలాగే హాలీవుడ్ ఇండస్ట్రీలో మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తుంది శ్రుతిహాసన్.

ఇవే కాకుండా కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో హీరోయిన్ ఓరియెంటెడ్ కథలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ పై నిర్మించనున్నారు. శ్రుతి హాసన్ మొదటి సారి తన తండ్రి నిర్మాణంలో నటించనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి తెలియాల్సి ఉంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతి.. నతకు కష్టపడి పనిచేయడమంటే చాలా ఇష్టమని.. ఎందుకంటే అలాంటి సమయంలోనే మానసికంగా ... శారీరకంగా అలసిపోయి ఇంటి వెళ్లడం కంటే మంచి అనుభూతి మరొకటి ఉండదని.. రోజు చివరిలో అలా అలసిపోయిన అనుభూతి లేకపోతే చెత్తగా ఉంటుందని చెప్పుకొచ్చింది.




