- Telugu News Photo Gallery Cinema photos Keerthy Suresh following Anupama Parameswaran ready to do more glamorous roles in Bollywood
Keerthy Suresh: బాలీవుడ్ కోసం రెచ్చిపోడానికి రెడీ అంటున్న కీర్తి సురేష్
కెరీర్ మునిగిపోతున్నపుడు హీరోయిన్లకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. ఒకటి గ్లామర్ షో చేయాలి.. లేదంటే గౌరవంగా సైడ్ ఇచ్చేయాలి. కొందరు రెండో ఆప్షన్ తీసుకుని తప్పుకున్నారు. కానీ నేను ఆ టైప్ కాదంటున్నారు కీర్తిసురేష్. ఈ మధ్యే గ్లామర్ షోకు తెరతీసిన ఈమె.. బాలీవుడ్ కోసం మరింత రెచ్చిపోడానికి రెడీ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ తెలుగులో దసరా తో సూపర్ హిట్ అందుకున్న కీర్తీ సురేష్ తమిళ్ లో కూడా మామన్నన్ సినిమాతో సత్తా చాటింది.
Updated on: Feb 22, 2024 | 8:03 PM

కెరీర్ మునిగిపోతున్నపుడు హీరోయిన్లకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. ఒకటి గ్లామర్ షో చేయాలి.. లేదంటే గౌరవంగా సైడ్ ఇచ్చేయాలి. కొందరు రెండో ఆప్షన్ తీసుకుని తప్పుకున్నారు. కానీ నేను ఆ టైప్ కాదంటున్నారు కీర్తిసురేష్. ఈ మధ్యే గ్లామర్ షోకు తెరతీసిన ఈమె.. బాలీవుడ్ కోసం మరింత రెచ్చిపోడానికి రెడీ అవుతున్నారు.

లాస్ట్ ఇయర్ తెలుగులో దసరా తో సూపర్ హిట్ అందుకున్న కీర్తీ సురేష్ తమిళ్ లో కూడా మామన్నన్ సినిమాతో సత్తా చాటింది. ఇక మరోపక్క భోళా శంకర్ లో కూడా నటించిన అమ్మడు ఆ సినిమాతో ఫెయిల్యూర్ ఫేస్ చేసింది. ఈ ఇయర్ ఇప్పటికే తమిళంలో 4 సినిమాల దాకా చేస్తున్న కీర్తి సురేష్ బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది.

కెరీర్ మొత్తం ఇలాగే మహానటి అని పిలిపించుకోవాలని పాపం కీర్తి సురేష్‌కు మాత్రం ఉండదా చెప్పండి..? కానీ ఎక్కడ పిలవనిస్తుంది ఈ పాడు సమాజం..? పైగా గ్లామర్ షో చేయకపోతే ఆఫర్స్ కూడా రావాయే..! దాంతో ఆఫర్స్ కోసం అందాల ఆరబోతకు తెర తీయడం తప్ప మరో ఆప్షనే లేదిప్పుడు కీర్తి చేతిలో. అందుకే మెల్లగా అటు వైపు ఈ మోడ్రన్ మహానటి అడుగులు పడుతున్నాయి.

నటిగా గుర్తింపు ఉంది.. సాక్ష్యంగా జాతీయ అవార్డు ఉంది.. అయినా ఆఫర్సే రావట్లేదు. అందుకే అనుపమ పరమేశ్వరన్ మాదిరే.. కీర్తి సురేష్ కూడా మేకోవర్ అయ్యేందుకు రెడీ అయిపోయారు. రౌడీ బాయ్స్ నుంచి అనుపమ 2.0 కనిపిస్తున్నారు. ఇక టిల్లు స్క్వేర్‌లో అయితే లిప్ లాక్స్ చేస్తూ పెద్ద షాకే ఇచ్చారు అనుపమ.

కీర్తి సురేష్ సైతం అనుపమ దారిలో వెళ్తున్నారు. బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్‌లో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ మధ్య లిప్ లాక్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. మొదట్లో మొహమాటపడినా.. తర్వాత ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి కెరీర్‌లో నిలబడాలంటే.. కొన్ని తప్పవనే క్లారిటీ ఇప్పుడిప్పుడే అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి బ్యూటీస్‌కు వస్తుంది.




