- Telugu News Photo Gallery Cinema photos Mrunal Thakur's Focus on Bollywood Despite Tollywood Success
నో తెలుగు.. ఓన్లీ హిందీ అంటున్న ఆ బ్యూటీ.. ఇలా చేస్తే ఫ్యాన్స్ ఏమైపోవాలి
కొందరు హీరోయిన్లంతే.. అవకాశాలిచ్చినా.. అందలమెక్కించినా.. వాళ్ళ మనసు మాత్రం టాలీవుడ్ కాదని బాలీవుడ్‌పైనే ఉంటుంది. మరో భామ కూడా ఇదే చేస్తున్నారు. తెలుగులో వరసగా ఆఫర్స్ ఇస్తున్నా.. కోట్ల పారితోషికం ఇస్తామన్నా.. ఆమె మాత్రం ఛలో బాలీవుడ్ అంటున్నారు. అక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్..?
Updated on: Jul 08, 2025 | 8:42 PM

పదేళ్ళ నుంచి బాలీవుడ్‌లో ఉన్నా రాని పేరు.. తెలుగులో రెండంటే రెండు సినిమాలతోనే తెచ్చుకున్నారు మృణాళ్ ఠాకూర్. నార్త్‌లో అరడజన్ సినిమాలు.. దానికి ముందు సీరియల్స్ చేసినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.

అలాంటి సమయంలో సీతా రామం అనే ఒక్క సినిమా ఈమె జాతకాన్ని మార్చేసింది. హాయ్ నాన్నతో తెలుగులో సెటిలయ్యే ఛాన్స్ వచ్చింది. ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచినా.. మృణాళ్ ఠాకూర్‌కు టాలీవుడ్‌లో ఆఫర్స్ బానే వస్తున్నాయి.

కానీ ఈమె మాత్రం సౌత్ వైపు పెద్దగా చూడట్లేదు. ఏదో మొహమాటానికి 2 సినిమాలు చేసారేమో అనిపిస్తుంది ఈమె తీరు చూస్తుంటే..! ప్రస్తుతం ఈమె చేస్తున్న ఒకే ఒక్క తెలుగు సినిమా డెకాయిట్.

ఇది కూడా శృతి హాసన్ వదిలేస్తే.. ఆమె ప్లేస్‌లోకి మృణాళ్ వచ్చారు. హిందీలో ప్రస్తుతం అజయ్ దేవ్‌గన్‌తో సన్నాఫ్ సర్దార్ 2లో నటిస్తున్నారు మృణాళ్. దాంతో పాటు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కమిటయ్యారు.

బాలీవుడ్ కోసం గ్లామర్ షో కూడా భారీగానే చేస్తున్నారు ఈ బ్యూటీ. మొత్తానికి ఇక్కడెన్ని ఛాన్సులిచ్చినా.. ఇస్తామని చెప్పినా.. మృణాళ్ మనసు మాత్రం ఛలో ముంబై అనే అంటుంది.




