AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: వాళ్ళు చేసిన తప్పు నేను చేయను.. నిదానమే ప్రధానం అంటున్న మృణాల్‌ ఠాకూర్‌

ఒక్క హిట్ రాగానే పొలోమని 10 సినిమాలు ఒప్పుకుంటున్నారు హీరోయిన్లు.. అలా చేసి చేతులు కాల్చుకున్న ముద్దుగుమ్మల కూడా చాలా మందున్నారు మన ఇండస్ట్రీలో. ఆ తప్పు తను చేయనంటున్నారు మృణాళ్ ఠాకూర్. సినిమాల ఎంపికలో మృణాళ్ ఫాలో అవుతున్న తీరు చూస్తుంటే బాబోయ్ అనకుండా ఉండలేం. సైలెంట్‌గా ఉంటూనే సెన్సేషనల్ ప్లానింగ్ చేస్తున్నారు. మృణాళ్ ఠాకూర్.. టాలీవుడ్‌గా ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు ఇది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Feb 10, 2024 | 1:21 PM

Share
ఒక్క హిట్ రాగానే పొలోమని 10 సినిమాలు ఒప్పుకుంటున్నారు హీరోయిన్లు.. అలా చేసి చేతులు కాల్చుకున్న ముద్దుగుమ్మల కూడా చాలా మందున్నారు మన ఇండస్ట్రీలో. ఆ తప్పు తను చేయనంటున్నారు మృణాళ్ ఠాకూర్. సినిమాల ఎంపికలో మృణాళ్ ఫాలో అవుతున్న తీరు చూస్తుంటే బాబోయ్ అనకుండా ఉండలేం. సైలెంట్‌గా ఉంటూనే సెన్సేషనల్ ప్లానింగ్ చేస్తున్నారు.

1 / 5
మృణాళ్ ఠాకూర్.. టాలీవుడ్‌గా ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు ఇది. చేసింది రెండు సినిమాలే కావచ్చు.. కానీ ఆ రెండింట్లోనూ మృ‌ణాళ్ గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్ మాట్లాడింది. దాంతో ఈమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ మృణాళ్ మాత్రం నిదానమే ప్రధానం అంటున్నారు. ఓ సినిమా అయ్యాకే.. మరో సినిమా అంటూ నింపాదిగా అడుగులేస్తున్నారు.

2 / 5
బాలీవుడ్‌లో బోల్డ్ షో.. టాలీవుడ్‌లో ట్రెడీషినల్.. మృణాల్ ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. ఆమె కావాలనుకున్న ఇమేజ్ కాదు కానీ దర్శకులు మాత్రం మృణాళ్‌లోని నటిని మాత్రమే చూస్తూ.. గ్లామర్ కోణం వదిలేసారు. సీతా రామం, హాయ్ నాన్న ఇమేజ్ అంత బలంగా పడిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌లోనూ పద్దతిగానే కనిపిస్తున్నారు మృణాళ్ ఠాకూర్.

3 / 5
ఆఫర్స్ క్యూ కడుతున్నా.. శ్రీలీల, కృతి శెట్టి మాదిరి తొందరపడట్లేదు మృణాళ్. వాళ్లు చేసిన తప్పు తాను చేయకూడదని ఫిక్సైపోయారు ఈ భామ.

4 / 5
ఒకేసారి అరడజన్ సినిమాలు చేస్తే.. అన్నీ విడుదలవుతాయేమో కానీ పెద్దగా లాభముండదనేది మృణాళ్ ఆలోచన. ప్రస్తుతం తమిళంలో శింబు, శివకార్తికేయన్, అజిత్‌తో జోడీ కడుతున్నారు ఈ భామ. మరి మృణాళ్ ఫాలో అయ్యే ఈ దారి ఆమె కెరీర్‌ను ఎలా డిసైడ్ చేయబోతుందో చూడాలి.

5 / 5