- Telugu News Photo Gallery Cinema photos Megastar Chiranjeevi plan with director vasishta coming for sankranti 2024 with vishwambhara movie Telugu Heroes Photos
Chiranjeevi: గోల్ అంటే ఇలా ఉండాలి.! పక్క ప్లానింగ్ తో ఈసారి బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే..
గోల్ అంటే ఎలా ఉండాలి? రాత్రింబవళ్లు అదొక్కటే ఆలోచనతో ఉండాలి. దాన్ని రీచ్ అయ్యేవరకు అసలు ఇంకో ధ్యాసలేనట్టు పనిచేయాలి. ఎన్ని పనుల మధ్య ఉన్నా.. ఫుల్ ఫోకస్ మాత్రం లక్ష్యం మీదే ఉండాలి. ఇప్పుడు అలాంటి లక్ష్యంతోనే పనిచేస్తున్నారు మెగాస్టార్. సంక్రాంతికి ధమాకా సక్సెస్ చూడాలన్నదే ఇప్పుడు ఆయన ధ్యేయం.. పూనకాలు లోడింగ్ అంటూ లాస్ట్ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవి చేసిన సందడి ఇంకా ఫ్యాన్స్ చెవుల్లో మారుమోగుతూనే ఉంది.
Updated on: Sep 05, 2024 | 1:11 PM

గోల్ అంటే ఎలా ఉండాలి? రాత్రింబవళ్లు అదొక్కటే ఆలోచనతో ఉండాలి. దాన్ని రీచ్ అయ్యేవరకు అసలు ఇంకో ధ్యాసలేనట్టు పనిచేయాలి. ఎన్ని పనుల మధ్య ఉన్నా.. ఫుల్ ఫోకస్ మాత్రం లక్ష్యం మీదే ఉండాలి.

తనకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టమని.. నటన కంటే డాన్స్‌పైనే తనకు ఎక్కువ ఇష్టం ఉండేదని చెప్పుకొచ్చారు మెగాస్టార్. ఎంతైనా డాన్సుల్లో గిన్నీస్ రికార్డ్ అంటే చిన్న విషయం కాదు.. మెగాస్టార్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.

ముగ్గుల పండక్కి మస్త్ సినిమా ఇచ్చారు బాస్ అని పొంగిపోయారు ఫ్యాన్స్. కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన భోళా శంకర్ మాత్రం బొమ్మను తిప్పేసింది.

భోళా శంకర్ సినిమా వచ్చిందనే విషయాన్ని మరిపింప జేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు మెగాస్టార్. బింబిసారతో సూపర్‌డూపర్ సక్సెస్ అయిన వశిష్టకు సెకండ్ సినిమా ఛాన్స్ ఇచ్చేసి,

సంక్రాంతికి వచ్చేయడానికి సర్వం సిద్ధం చేసుకోమన్నారు. ఆ పనులు చకాచకా జరుగుతున్నాయిప్పుడు. విశ్వంభర కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.

సంక్రాంతి పండక్కి పర్ఫెక్ట్ ఫీస్ట్ రాబోతుందన్న క్లారిటీ రావటంతో ఆల్రెడీ సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు మెగా అభిమానులు.

ఇంకెంతసేపు.. అలా చూస్తూ ఉండండి.. ఇలా సంక్రాంతికి కలుసుకుందాం అనే హింట్స్ అందుతున్నాయి మెగా ఫ్యాన్స్ కి. బాసూ వేర్ ఈజ్ ద పార్టీ అంటూ పాడేసుకుంటున్నారు మెగాసైన్యం.




