Emergency: కంగనకు, కాంట్రవర్శీకి అంత విడదీయరాని బంధం ఏంటి.? మరోసారి ఇలా..
కంగనను, కాంట్రవర్శీకి అంత విడదీయరాని బంధం ఏంటి? అనే చర్చ మరోసారి మొదలైంది. ఎన్నికల్లో గెలిస్తే సినిమాలకు చెక్ పెట్టేస్తానని చెప్పిన కంగన రనౌత్.. ఇప్పుడు ఆ విషయం గురించి క్లారిటీ ఇవ్వకపోయినా, ఆల్రెడీ చేసిన సినిమాతో మాత్రం వార్తల్లో ఉంటున్నారు. నార్త్ తలైవి కంగన రనౌత్ గురించి వార్తలు జోరందుకున్నాయి నార్త్ మీడియాలో. ఆమె నటించి, డైరక్ట్ చేసి, ప్రొడ్యూస్ చేసిన ఎమర్జెన్సీ సినిమా వాయిదా పడుతుందన్నది న్యూస్.