- Telugu News Photo Gallery Cinema photos Manushi Chillar Latest Photos in White Saree Like Marble Sculpture
తెల్ల చీరలో ఎంత ముద్దుగుందో.. పాలరాతి శిల్పంలా మానుషి చిల్లర్!
అందాల తారా మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. చాలా మందికి ఈ ముద్దుగుమ్మ ఫేవరెట్. తాజాగా ఈ బ్యూటీ వైట్ శారీలో ఆకాశంలోని చందమామలా మెరిసిపోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Mar 05, 2025 | 3:57 PM

2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న మానుషి చిల్లర్ తర్వాత నటిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ వరస ఆఫర్స్‌తో దూసుకెళ్తుందని చాలా మంది భావించారు. కానీ ఈ అమ్మడు సరైన హిట్ ఒక్కటి కూడా అందుకోలేకపోతుంది.

ఈ చిన్నది దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన సామ్రాట్ పృథ్వీరాజ్ అనే సినిమా ద్వారా వెండితెరపైకి అడుగు పెట్టింది. ఈ మూవీ 2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.

ఈ ముద్దుగుమ్మకు మొదటి సినిమానే ఫెయిల్యూర్ ఇచ్చింది అనుకుంటే, తర్వాత విక్కీ కౌశల్ ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది.

ఇలా ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రావడం లేదు. ఎన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకోలేకపోతుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా వైట్ శారీలో మెస్మరైజింగ్ లుక్స్‌తో దర్శనం ఇచ్చింది. అచ్చం పాలరాతి శిల్పంలా ఈ ముద్దుగుమ్మ కనిపిస్తుంది. దీంతో మానుషి వైట్ చీరలో బ్యూటిఫుల్‌గా ఉన్నావంటూ తమ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.



