- Telugu News Photo Gallery Cinema photos Manchu Manoj And Mounika Daughter Annaprasana Photos Go Viral
Manchu Manoj: మంచు మనోజ్- మౌనికల కూతురి అన్న ప్రాసన వేడుక.. ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కొన్ని నెలల క్రితం తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని సతీమణి భూమా మౌనికా రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తమ బిడ్డకు దేవసేన శోభా ఎమ్‌ఎమ్ అని నామకరణం కూడా చేశారు మనోజ్ దంపతులు.
Updated on: Sep 14, 2024 | 4:58 PM

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కొన్ని నెలల క్రితం తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని సతీమణి భూమా మౌనికా రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తమ బిడ్డకు దేవసేన శోభా ఎమ్‌ఎమ్ అని నామకరణం కూడా చేశారు మనోజ్ దంపతులు.

తాజాగా తమ కూతురి అన్న ప్రాసన వేడుకను ఘనంగా నిర్వహించారు మనోజ్- మౌనిక. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

మరి కోడలి అన్న ప్రాసన వేడుకకు అత్త లేకపోతే ఎలా?అందుకే ముంబై నుంచి మరీ పరుగెత్తుకుంటూ ఈ వేడుకకు వచ్చేసింది మంచు లక్ష్మి. ఆమె వెంట కూతురు యాపిల్ కూడా ఉంది.

ప్రస్తుతం మనోజ్ కూతురి అన్న ప్రాసన వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అభిమానులు, నెటిజన్లును అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఈ ఫొటోలలో ఎక్కడ తమ చిన్నారి ముఖం కనబడకుండా జాగ్రత్తపడ్డారు మనోజ్- మౌనిక దంపతులు. కూతురి ముఖాన్ని ఎమోజీలతో కవర్ చేశారు