- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu S S Rajamouli SSMB29 Movie Announcement Date Fixed
SSMB29: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అప్‌డేట్ చెప్పేది ఆ రోజే
మహేష్ బాబు ఫ్యాన్స్‌కు ఇంకా ఎన్నాళ్లు ఈ వెయిటింగ్..? ప్రతీ ఏడాది మే 31 వచ్చిందంటే చాలు కచ్చితంగా మహేష్ సినిమా అప్‌డేట్ ఒకటి వచ్చేది.. కానీ ఈసారి అలాంటిదేం రాలేదు. రాజమౌళి సినిమా కాబట్టి అలాంటిది ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫ్యాన్స్. కానీ వాళ్లకు కూడా ఆశ ఉంటుంది కదా..? ఆ ఆశతోనే అడుగుతున్నారు SSMB29 అప్‌డేట్ ఎక్కడా అని..? మరి దాని ముచ్చటేంటి..? ట్రిపుల్ ఆర్ విడుదలై చూస్తుండగానే రెండేళ్లైపోయింది.. ఇప్పటి వరకు నెక్ట్స్ సినిమాను మొదలుపెట్టనే లేదు జక్కన్న.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Jun 02, 2024 | 7:41 PM

మహేష్ బాబు ఫ్యాన్స్‌కు ఇంకా ఎన్నాళ్లు ఈ వెయిటింగ్..? ప్రతీ ఏడాది మే 31 వచ్చిందంటే చాలు కచ్చితంగా మహేష్ సినిమా అప్‌డేట్ ఒకటి వచ్చేది.. కానీ ఈసారి అలాంటిదేం రాలేదు. రాజమౌళి సినిమా కాబట్టి అలాంటిది ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫ్యాన్స్. కానీ వాళ్లకు కూడా ఆశ ఉంటుంది కదా..? ఆ ఆశతోనే అడుగుతున్నారు SSMB29 అప్‌డేట్ ఎక్కడా అని..? మరి దాని ముచ్చటేంటి..?

ట్రిపుల్ ఆర్ విడుదలై చూస్తుండగానే రెండేళ్లైపోయింది.. ఇప్పటి వరకు నెక్ట్స్ సినిమాను మొదలుపెట్టనే లేదు జక్కన్న. మహేష్ బాబుతో సినిమా అనే ముచ్చట తప్పిస్తే.. దానికి మించి ఒక్క అప్‌డేట్ కూడా రాలేదు.

అలాంటప్పుడు ఇంకా అనౌన్స్ మెంట్‌కి జక్కన్న ఎందుకు ఆగుతున్నట్టు.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా సినిమా మాత్రం 2028లోనే సినిమా రిలీజ్ అవుతుందనే మాట మరోవైపు వైరల్ అవుతోంది.

అంతేకాదు.. స్క్రిప్ట్ వర్క్ పూర్తైందని.. ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందని మాత్రమే అప్‌డేట్ ఇచ్చారు. దానికి మించిన ఏ అప్‌డేట్ ఇవ్వలేదు. ఇప్పటికే హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో SSMB29 కోసం సెట్ వర్క్ జరుగుతుంది. మరోవైపు మహేష్ మేకోవర్ కూడా ప్రాసెస్‌లో ఉంది. SSMB29పై చాలా వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి.

గరుడ ప్రాజెక్ట్ గురించి తన మనసులో రకరకాల ఆలోచనలున్నాయని అప్పట్లో జక్కన్న చెప్పిన ఓ వీడియో ఇప్పుడు మళ్లీ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంతే కాదు, ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ జక్కన్న టేకప్ చేస్తున్న ఎస్ ఎస్ ఎం బీ 29 ప్రాజెక్టుకీ, దీనికీ లింక్ ఉందా? అంటూ సరికొత్త డిస్కషన్‌కి తెర లేచింది.





























