- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Ran Away Crying From Sets Of Her First Movie, Now She Is Super Star, She Is Ileana D’Cruz
Tollywood: 18 ఏళ్లకే ఇండస్ట్రీని ఏలేసింది.. ఫస్ట్ సినిమా సెట్స్ నుంచి ఏడుస్తూ పారిపోయి.. కట్ చేస్తే.. ఇప్పుడు సూపర్ స్టార్..
సినీరంగుల ప్రపంచంలో అందం, అభినయంతో ఆకట్టుకున్న తారలు చాలా మంది ఉన్నారు. చిన్న వయసులోనే నటిగా కెరీర్ స్టార్ట్ చేసి ఊహించని విధంగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. 18 ఏళ్లకే ఇండస్ట్రీని ఏలేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
Updated on: Jul 11, 2025 | 10:35 PM

18 ఏళ్లకే నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. మొదటి సినిమా సెట్ లో డైరెక్టర్ అరుపుతో భయం, కన్నీళ్లతో పారిపోయింది. అయినప్పటికీ తన ఆశను కోల్పోలేదు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారింది. ఆమె ఎవరో తెలుసా.. ?

మనం మాట్లాడుకుంటున్న నటి మరెవరో కాదు ఇలియానా డి'క్రూజ్. ఆమె 2006లో 18 ఏళ్ల వయసులో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆమె తొలి చిత్రం దేవదాసు. కానీ మొదట్లోనే సినీ ప్రపంచాన్ని చూసి భయపడింది. సెట్స్ నుంచి ఏడుస్తూ పారిపోయింది. కానీ తనను తాను నిరూపించుకోవాలనే ఒత్తిడితో నిలబడింది.

మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే తన తల్లికి కన్నీళ్లతో ఫోన్ చేసి, తాను సినిమా చేయనని చెప్పిందట. కానీ తన తల్లి ఆమెకు ధైర్యం చెప్పడంతో ఇండస్ట్రీలో కొనసాగిందట. దేవదాసు తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. మహేష్ బాబు సరసన పోకిరి సినిమా ఆమె కెరీర్ మార్చేసింది.

తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటించింది. 19 సంవత్సరాల తన కెరీర్ పథంలో, ఇలియానా 35 కి పైగా చిత్రాల్లో నటించింది. తన విజయం ఆత్మవిశ్వాసం, ఓర్పు, కృషితో వస్తుందని చూపించింది.

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమైంది ఇలియానా. ఆ తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు. కొన్నాళ్లు సైలెంట్ అయిన ఇలియానా.. అనుహ్యంగా తన ప్రెగ్నెన్సీ ప్రకటించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన భర్తను పరిచయం చేసింది. ప్రస్తుతం ఇలియానా తన రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తుంది.




