SSMB29: మహేష్ మూవీకి వారణాసితో పనేంటి ?? టాలీవుడ్‌లో హాట్ టాపిక్
ప్రభాస్ కల్కి మూవీకి, సూపర్‌స్టార్ మహేష్ బాబు - రాజమౌళి సినిమాకీ ఓ స్పెషల్ లింక్ ఉందా? రెండు సినిమాల సబ్జెక్టులకూ ఓ పట్టణంతో పెద్ద అనుబంధం ఉందా? ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. కల్కి సీక్వెల్‌కీ, ఎస్ఎస్ఎంబీ29కీ మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? డీటైల్డ్ గా మాట్లాడుకుందాం పదండి...
Updated on: Nov 16, 2024 | 10:35 PM

దానికి ముహూర్తం పెట్టింది కూడా ప్రభాసే. అందుకే మిగిలిన వాళ్ల కంటే రెండాకులు ఎక్కువే చదివాడు రెబల్ స్టార్. ఇండియాతో పాటు ఇప్పటికే ఓవర్సీస్‌లోనూ అదరగొడుతున్నారు ప్రభాస్.

కల్కి సినిమా చూసిన వారికీ, వారణాసితో ఆ సినిమాకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యూచరిస్టిక్ కథకు, వారణాసితో లింకు పెడుతూ తెరకెక్కించి మెప్పించారు నాగ్ అశ్విన్. ఇప్పుడు సెకండ్ పార్టులోనూ వారణాసి ప్రస్తావన తప్పక ఉంటుంది.

ఇటు మహేష్ బాబు సినిమా కోసం కూడా వారణాసి సెట్‌ని వేస్తున్నారు జక్కన్న. హైదరాబాద్ శివార్లలో ఈ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మహేష్‌బాబు ఓ పౌరాణిక పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఆ కేరక్టర్ ఏంటన్న దాని మీద పర్టిక్యులర్‌గా క్లారిటీ రావాల్సి ఉంది.

ఎస్ఎస్ఎంబీ29లో హనుమాన్ కేరక్టర్ ఉంటుందనే మాట కూడా ఆ మధ్య జోరుగా వినిపించింది. ఆ మాటలకు వత్తాసు పలికేలా మహేష్.. రాముడి గెటప్‌లో ఉన్న పిక్స్ గట్టిగా వైరల్ అవుతున్నాయి.

వారణాసికి భవిష్యత్తును ముడిపెట్టి నాగీ.. కల్కి మూవీ తీస్తే, జక్కన్న మాత్రం వారణాసికి పురాణాలను ముడిపెట్టి అరణ్యాలలో నడిపించే కథను సెలక్ట్ చేసుకున్నారా? ఇంతకీ ఎస్ఎస్ఎంబీ29 జోనర్ ఏంటి? అనే చర్చ నెట్టింట్లో స్పీడందుకుంది.




