Keerthy Suresh: మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీ లో కీర్తి సురేష్
మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్, తరువాత ఆ రేంజ్ సక్సెస్ అందుకోవటంలో ఫెయిల్ అవుతున్నారు. కమర్షియల్ సినిమాలు సక్సెస్ అవుతున్నా... లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో ప్రూవ్ చేసుకోవాలన్న కోరిక మాత్రం తీరటం లేదు. అందుకే అప్ కమింగ్ మూవీ రఘుతాత మీదే ఆశలు పెట్టుకున్నారు కీర్తి. మహానటి సినిమా రిలీజ్ అయిన తరువాత టాలీవుడ్ స్క్రీన్ మీద మరో సావిత్రి అంటూ కీర్తి సురేష్‌ను ఆకాశానికి ఎత్తేశారు ఆడియన్స్. కానీ ఈ జోరు ఎక్కువ కాలం కనిపించలేదు.
Updated on: Dec 22, 2023 | 1:25 PM

మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్, తరువాత ఆ రేంజ్ సక్సెస్ అందుకోవటంలో ఫెయిల్ అవుతున్నారు. కమర్షియల్ సినిమాలు సక్సెస్ అవుతున్నా... లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో ప్రూవ్ చేసుకోవాలన్న కోరిక మాత్రం తీరటం లేదు. అందుకే అప్ కమింగ్ మూవీ రఘుతాత మీదే ఆశలు పెట్టుకున్నారు కీర్తి.

మహానటి సినిమా రిలీజ్ అయిన తరువాత టాలీవుడ్ స్క్రీన్ మీద మరో సావిత్రి అంటూ కీర్తి సురేష్‌ను ఆకాశానికి ఎత్తేశారు ఆడియన్స్. కానీ ఈ జోరు ఎక్కువ కాలం కనిపించలేదు. మహానటి తరువాత కీర్తి ఖాతాలో ఒక్క బిగ్ హిట్ కూడా పడలేదు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్‌తో కీర్తి చేసిన ప్రయోగాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి.

కమర్షియల్ సినిమాలతో ఒకటి రెండు సక్సెస్‌లు వచ్చినా.. ఆ క్రెడిట్ కీర్తి ఖాతాలో పడలేదు. దీంతో తన పేరు కూడా వినిపించే సాలిడ్ హిట్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు కీర్తి సురేష్. రీసెంట్ టైమ్స్‌లో నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటించినా... ఆ సినిమాలు సక్సెస్ కాకపోవటంతో కీర్తి కెరీర్‌కు ఉపయోగపడలేదు.

సర్కారువారి పాట, దసరా లాంటి కమర్షియల్ సినిమాలు మంచి విజయాలు సాధించినా.. ఆ సక్సెస్ క్రెడిట్‌లో కీర్తికి దక్కిన షేర్ అంతంత మాత్రమే అందుకే, సక్సెస్ విషయంలోనూ తన గురించి మాట్లాడుకునే రేంజ్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు కీర్తి.

ప్రజెంట్ ఓ బాలీవుడ్ మూవీతో పాటు రఘుతాత అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు కీర్తి సురేష్. హెంబలే ఫిలింస్ కోలీవుడ్లో నిర్మిస్తున్న తొలి సినిమా కావటంతో రఘుతాత మీద మంచి బజ్ ఉంది. సోషల్ సెటైర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టి, లేడీ ఓరియంటెడ్ సెగ్మెంట్‌లోనూ తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు కీర్తి. మరి రఘుతాత అమ్మడి ఆశలు నేరవేరుస్తాడేమో చూడాలి.




