Salaar VS Devara: సలార్ Vs దేవర.. పోలికేంటి గురూ ??
అక్కడెక్కడో చూసి ఇన్‌స్పయిర్ అయి అనుకరించినా, అనుసరించినా ఇంతకు ముందు ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు మాత్రం ఎ టు జెడ్ అన్నిటినీ వివరంగా చెప్పేస్తున్నారు. పక్క వాళ్లను చూసి కాపీ కొట్టడం కాదు, ఓన్ స్టైల్‌ని ఎస్టాబ్లిష్ చేద్దామనుకున్నా ఇట్టే కనిపెట్టేస్తున్నారు. మొన్న సలార్ విషయంలో ట్రెండ్ అయిన టాపిక్, ఇప్పుడు దేవర విషయంలో రిపీట్ అవుతోంది. సలార్ సినిమా రిలీజ్‌కి ముందు రోజు వరకు కూడా ప్రశాంత్ నీల్ ప్రీవియస్ సినిమా ఉగ్రమ్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు జనాలు.
Updated on: Feb 14, 2024 | 8:14 PM

అక్కడెక్కడో చూసి ఇన్‌స్పయిర్ అయి అనుకరించినా, అనుసరించినా ఇంతకు ముందు ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు మాత్రం ఎ టు జెడ్ అన్నిటినీ వివరంగా చెప్పేస్తున్నారు. పక్క వాళ్లను చూసి కాపీ కొట్టడం కాదు, ఓన్ స్టైల్‌ని ఎస్టాబ్లిష్ చేద్దామనుకున్నా ఇట్టే కనిపెట్టేస్తున్నారు. మొన్న సలార్ విషయంలో ట్రెండ్ అయిన టాపిక్, ఇప్పుడు దేవర విషయంలో రిపీట్ అవుతోంది.

సలార్ సినిమా రిలీజ్‌కి ముందు రోజు వరకు కూడా ప్రశాంత్ నీల్ ప్రీవియస్ సినిమా ఉగ్రమ్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు జనాలు. ఇద్దరు స్నేహితుల మధ్య కథ, అందులో ఉన్న డైలాగులు, ఇందులో ఉన్న డైలాగులు, చేతి మీద టాటూలు, ఇలా ప్రతి విషయాన్ని పోల్చి చూపించారు. సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఈ విషయాన్ని వదిలిపెట్టలేదు ఔత్సాహికులు.

ఇప్పుడు ఇలాంటి డిస్కషన్ కొరటాల శివ విషయంలో మొదలైంది. తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీ రోల్ చేస్తున్నారు. భయమంటే తెలియని వారిలో భయం కలిగించే వ్యక్తిగా తారక్‌ని చూపించబోతున్నారు కొరటాల శివ.

తారక్ దేవర సినిమాను, ప్రభాస్ మిర్చి సినిమాతో పోల్చి చూస్తున్నారు జనాలు. దేవర సినిమాలో తండ్రీ కొడుకుల సెంటిమెంట్ ఉంటుందట. ఫస్ట్ పార్టులో కొడుకు కేరక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసి, సెకండ్ పార్టులో తండ్రి కేరక్టర్ మీద ఫోకస్ చేస్తారట కొరటాల.

కొరటాల కమర్షియల్ సక్సెస్ మిర్చిలోనూ తండ్రీ కొడుకుల సెంటిమెంట్ ఉంటుంది. తండ్రికి దూరంగా పెరిగినప్పటికీ, కొడుకులో పౌరుషం ఎలా నివురుగప్పిన నిప్పులా ఉంటుందో చూపించారు కెప్టెన్. ఇప్పుడు దేవరలోనూ అలాంటి సన్నివేశాలనే రిపీట్ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అయితే ప్యాన్ ఇండియా రేంజ్‌లో చేస్తున్న దేవర కోసం కెప్టెన్ అంతకు మించే చేసి చూపిస్తారన్నది నందమూరి అభిమానుల నమ్మకం.




