SSMB 29: మహేష్ కోసం మెగా స్కెచ్.. మామూలుగా లేదుగా జక్కన్న..
గుంటూరు కారం సక్సెస్‌తో ఫుల్ హ్యాపీగా ఉన్న మహేష్ అదే జోష్‌లో నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ఎనౌన్స్ చేసిన మహేష్ ఆ సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు. రాజమౌళి కూడా అంచనాలకు తగ్గ రేంజ్‌లో కాస్టింగ్ సెట్ చేసే పనిలో ఉన్నారు. రాజమౌళి, మహేష్ కాంబో మీద భారీ అంచనాలు ఉన్నాయి. గుంటూరు కారం వైబ్ చూసిన తరువాత ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకు తగ్గ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు దర్శక ధీరుడు రాజమౌళి.