War 2: వార్ 2 గురించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు మేకర్స్ !!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండటంతో వార్ 2 సినిమా మీద సౌత్‌లోనూ మంచి బజ్ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు మేకర్స్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమా కథ ఏంటన్నది క్లారిటీ ఇచ్చారు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన సూపర్ హిట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Aug 16, 2024 | 7:00 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండటంతో వార్ 2 సినిమా మీద సౌత్‌లోనూ మంచి బజ్ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు మేకర్స్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమా కథ ఏంటన్నది క్లారిటీ ఇచ్చారు.

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన సూపర్ హిట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. పార్ట్ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పుడు వార్ 2తో ఆ మార్కెట్ డబుల్ అవుతుందని చూస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌పై మేజర్ అప్‌డేట్ వచ్చింది. వార్ 2 షూటింగ్ వేగంగా జరుగుతుంది.

వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న వార్ 2 మూవీ... వార్, టైగర్ 3 సినిమాలు ఎక్కడ ముగిసాయో అక్కడి నుంచే మొదలవుతుందన్న హింట్ ఇచ్చారు మేకర్స్. అంటే ఈ సినిమాకు గతంలో స్పై యూనిరవ్స్‌లో వచ్చిన టైగర్, పఠాన్ క్యారెక్టర్స్‌తోనూ లింక్ ఉంటుందన్నమాట.

వార్ 2లో పఠాన్ క్యారెక్టర్ కూడా కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. పఠాన్‌లో సల్మాన్ ఖాన్, టైగర్ 3లో షారూఖ్ కనిపించినట్టుగానే వార్ 2లో షారూఖ్ గెస్ట్ రోల్ చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.





























