Mahesh Babu: అమ్మబాబోయ్.. గుంటూరు కారం కోసం మహేష్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమా గుంటూరు కారం. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రానుంది. దాంతో మహేష్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అతడు, ఖలేజా సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమారానుంది. ఈ సినిమాకు గుంటూరు కారం అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా శ్రీలీల నటిస్తుంది.