Eagle: ఇంట్రెస్టింగ్ గా ఈగల్ ట్రైలర్.. రవితేజ ఫెయిల్యూర్స్‌కు బ్రేక్ వేయనుందా ??
సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో మాస్ మహరాజ్ రవితేజ. ఈ మధ్య టైగర్ నాగేశ్వరరావుగా ప్రేక్షకుల ముందుకు రవితేజ, ఇప్పుడు ఈగల్‌గా మరో డిఫరెంట్ మూవీతో రెడీ అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు లాంటి ఫెయిల్యూర్స్ తరువాత రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా ఈగల్. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు తనదైన స్టైల్‌లో మాస్ ఎలిమెంట్స్‌ను యాడ్ చేశారు రవితేజ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
