అల వైకుంఠపురములో చిత్రం తో బన్నీ అండ్ త్రివిక్రమ్ జాయింట్‌గా హ్యాట్రిక్ హిట్ రిజిస్టర్ చేసుకున్నారు. బిఫోర్ ప్యాండమిక్ ఆ సినిమా జనాలను ఓ ఊపు ఊపేసింది. వీరిద్దరు కలిస్తే స్క్రీన్ మీద చేసే సిత్తరాలు అన్నీ ఇన్నీ కావని ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టిన ఈ ఇద్దరు ఇప్పుడు ఇంకో హ్యాట్రిక్‌కి నాంది పలక బోతున్నారు. ఆ సినిమా షూటింగ్ ఈ సెప్టెంబర్ నుంచే ఉంటుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.