Pooja Hegde: పాపం పూజా ఏం పాపం చేసింది.. ఆమెకే ఎందుకిలా..?
నేనేం పాపం చేసాన్రా.. కష్టాలన్నీ కంబైండ్‌గా నాపై ఇలా అటాక్ చేస్తున్నాయ్.! ఈ మాటలిప్పుడు పూజా హెగ్డేకు బాగా సూట్ అవుతాయి. షూటింగ్ మొదలైన సినిమాల్లోంచి తీసేస్తున్నారు.. సైన్ చేసిన సినిమాలేమో సడన్‌గా ఆగిపోతున్నాయి. పూజా కెరీర్ ఇక ఎండ్ అయినట్లేనా.. ఈ సంకేతాలన్నీ అవే సూచిస్తున్నాయా..? అసలు బుట్టబొమ్మ కెరీర్ మళ్లీ గాడిన పడుతుందా..? పాపం పూజా హెగ్డే.. ఇప్పుడు ఈమెను చూస్తుంటే ఈ మాట తప్ప మరోటి అనట్లేదు అభిమానులు.