- Telugu News Photo Gallery Cinema photos Hero Dhanush a twist in Vada Chennai sequel, details here Telugu Heroes Photos
Vada Chennai: వడ చెన్నై సీక్వెల్ విషయంలో ట్విస్ట్.! హీరోపై ఎఫెక్ట్.!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు దర్శకుడు వెట్రి మారన్. ఓ క్లాసిక్ సినిమాకు సీక్వెల్‌ను ఎనౌన్స్ చేసిన ఈ క్రియేటివ్ డైరెక్టర్, ఇప్పుడు ఆ సినిమా విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. ఏంటా సినిమా అనుకుంటున్నారా.! ధనుష్, వెట్రి మారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా వడ చెన్నై. పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ధనుష్ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచిపోయింది.
Updated on: Aug 16, 2024 | 4:30 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు దర్శకుడు వెట్రి మారన్. ఓ క్లాసిక్ సినిమాకు సీక్వెల్‌ను ఎనౌన్స్ చేసిన ఈ క్రియేటివ్ డైరెక్టర్, ఇప్పుడు ఆ సినిమా విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. ఏంటా సినిమా అనుకుంటున్నారా.!

ధనుష్, వెట్రి మారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా వడ చెన్నై. పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ధనుష్ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచిపోయింది.

అయితే వడ చెన్నై సినిమాను ఎనౌన్స్ చేసిన టైమ్‌లోనే రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. 2018లో తొలి భాగం ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆ తరువాత షార్ట్ గ్యాప్‌లోనే సీక్వెల్‌ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేశారు.

కానీ వెట్రిమారన్, ధనుష్ ఇద్దరూ ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా కావటంతో పార్ట్ 2 డిలే అవుతూ వచ్చింది. తాజాగా ఈ సీక్వెల్ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు డైరెక్టర్. వడ చెన్నై సీక్వెల్‌ను తాను డైరెక్ట్ చేయటం లేదన్నారు వెట్రి మారన్.

తన బ్యానర్‌లోనే సీక్వెల్‌ను నిర్మిస్తానని, ఆ సినిమాతో తన అసిస్టెంట్ దర్శకుడిగా పరిచయం అవుతాడని తెలిపారు. డైరెక్టర్ విషయంలోనే కాదు కాస్టింగ్ విషయంలో కూడా మార్పులు చేస్తున్నట్టుగా వెల్లడించారు.

వడ చెన్నై సీక్వల్‌లో ధనుష్ కూడా నటించటం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ న్యూస్‌తో కల్ట్ క్యారెక్టర్‌లో ధనుష్‌ను మరోసారి చూద్దామనుకున్న అభిమానులు ఫీల్ అవుతున్నారు.

ధనుష్ చేసిన రోల్‌ను మరో ఆర్టిస్ట్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరంటున్నారు. మరి ఈ కామెంట్స్ నేపథ్యంలో వెట్రిమారన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.




