AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara Movies: దసరా పండగను మన హీరోలు మర్చిపోయారా? లోపం ఎక్కడుంది.?

మనలో మనమాట.. అసలెందుకు మన హీరోలు దసరా పండగను పట్టించుకోరు..? నిజంగానే పట్టించుకోలేదా లేదంటే అనుకోకుండా అలా మిస్సైందా..? అలా అనుకోడానికి కూడా లేదు. ఎందుకంటే మూన్నాలుగు సినిమాలు కరెక్టుగా కాన్సట్రేట్ చేస్తే దసరాకే వచ్చేవి. కానీ అలా లైట్ తీసుకున్నారు మన హీరోలు. అసలు లోపం ఎక్కడుందంటారు..? ఎక్స్‌క్లూజివ్‌గా ఈ స్టోరీపై ఓ లుక్కేద్దామా.?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Prudvi Battula|

Updated on: Sep 22, 2024 | 3:17 PM

Share
దసరాకు మన సినిమాలు రేసులో లేకపోవడం.. మన లోపమేనా..? ఇప్పుడు ఈ అనుమానం ఎందుకొచ్చిందబ్బా అనుకోవచ్చు కానీ జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఈ సారి పండక్కి వేట్టయన్‌దే అప్పర్ హ్యాండ్. రజినీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకుడు. దాంతో పాటు గోపీచంద్ విశ్వం కూడా రేసులోనే ఉంది.

1 / 5
దసరాకు 10 రోజుల సెలవులుంటాయి. అంత పెద్ద సీజన్‌ను మన స్టార్ హీరోలు పూర్తిగా వదిలేసారు. సెప్టెంబర్ 27న రానున్న దేవరనే పండగ సినిమా అని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిప్పుడు.

2 / 5
 దాంతో పాటు అక్టోబర్ 4న శ్రీ విష్ణు స్వాగ్.. 11న గోపీచంద్ విశ్వం.. 12న సుహాస్ జనక అయితే గనక వస్తున్నాయి. మనకు ఈ సారి ఇవే దసరా సినిమాలు.దసరాకు వచ్చే అవకాశం ఉండి కూడా మన హీరోలు పట్టించుకోలేదు.

3 / 5
కావాలంటే బాలయ్యనే తీసుకోండి.. బాబీ దర్శకత్వంలో ఈయన నటిస్తున్న NBK109 దసరాకే రావాల్సింది. గతేడాది భగవంత్ కేసరితో దసరాకు వచ్చి మంచి హిట్ కొట్టారు బాలయ్య. ఈసారి ఇదే చేయాలనుకున్నా కుదర్లేదు. అలాగే ఓజి కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఎటూ కాకుండా పోయింది.

4 / 5
గేమ్‌ చేంజర్‌లో రామ్‌ ఇంతకీ ఎవరు? అతని చర్యలకు అందరూ అంతలా అవాక్కు కావాల్సిన అవసరం ఏంటో తెలియాలంటే జనవరి 10 దాకా వెయిట్‌ చేయాల్సిందే.

5 / 5