ఆత్మలు, దెయ్యాల బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమా కాబట్టి స్మశానంలో టీజర్ రిలీజ్ చేస్తున్నారు ఓకే..! మరి అదే నరకంపై సినిమా తీస్తే నరకంలో.. స్వర్గం నేపథ్యంలో సినిమా చేస్తే స్వర్గంలో టీజర్ విడుదల చేస్తారా అనేది కామన్ ఆడియన్స్ డౌట్. స్మశానంలో ఆత్మలు తిరుగుతాయని నమ్ముతుంటారు కాబట్టి అక్కడే టీజర్ లాంచ్ ప్లాన్ చేశారు కోన వెంకట్. మరి ఇది సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.