- Telugu News Photo Gallery Cinema photos Food concept Movies huge response in tollywood film industry like Bhamakalapam annapoorani Telugu Entertainment Photos
Food concept Movies: నయన్ ను ఫాలో అవుతున్న ప్రియమణి.! భామా కలాపం~2 తో మరోసారి.
ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలంటే ఎప్పుడూ హారర్, థ్రిల్లర్స్ మాత్రమే కాదు. మంచి కాన్సెప్టులతోనూ కాసులు కురిపించ వచ్చు. ముఖ్యంగా కాసుల పంట పండాలంటే, నాయికలు గరిట తిప్పాల్సిందే అంటోంది ప్రెజెంట్ ట్రెండ్. ఆల్రెడీ అన్నపూరణితో నయన్ ప్రూవ్ చేసుకున్నారు.! ఇప్పుడు ప్రియమణి ప్రిపేర్ అవుతున్నారు.. భామా కలాపం సీక్వెల్ చూశారా? ఫస్ట్ పార్టులో ఫన్ ప్లస్ థ్రిల్ పంచిన ప్రియమణి, ఇప్పుడు సెకండ్ పార్టుకి హ్యాపీగా రెడీ అయిపోయారు.
Updated on: Feb 18, 2024 | 6:06 PM

ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలంటే ఎప్పుడూ హారర్, థ్రిల్లర్స్ మాత్రమే కాదు. మంచి కాన్సెప్టులతోనూ కాసులు కురిపించ వచ్చు. ముఖ్యంగా కాసుల పంట పండాలంటే, నాయికలు గరిట తిప్పాల్సిందే అంటోంది ప్రెజెంట్ ట్రెండ్.

ఆల్రెడీ అన్నపూరణితో నయన్ ప్రూవ్ చేసుకున్నారు.! ఇప్పుడు ప్రియమణి ప్రిపేర్ అవుతున్నారు.. భామా కలాపం సీక్వెల్ ట్రైలర్ చూశారా? అను అండ్ శిల్ప కలిసి హోటల్‌లో ఏమేం చేశారో ట్రైలర్ చూసిన వాళ్లకి ఇట్టే అర్థమైపోతుంది.

ఫస్ట్ పార్టులో ఫన్ ప్లస్ థ్రిల్ పంచిన ప్రియమణి, ఇప్పుడు సెకండ్ పార్టుకి హ్యాపీగా రెడీ అయిపోయారు. ఫిబ్రవరి 16న ప్రేక్షకుల చేత ఆహా అనిపించడానికి నేను రెడీ అంటున్నారు ప్రియమణి.

భామా కలాపం 2లో హోటల్ ఎన్విరాన్‌మెంట్‌ని ప్రొజెక్ట్ చేశారు మేకర్స్. ప్రియమణి, శరణ్య గరిటలు, కత్తులు పట్టుకుని స్క్రీన్ మీద కనిపించిన తీరు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది.

ఫస్ట్ పార్టుని మించిన సక్సెస్ గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. ఆల్రెడీ హోటల్ కాన్సెప్ట్ తో తెరకెక్కి, ప్రేక్షకాదరణ పొందిన సినిమా అన్నపూరణి. నయన్ కీ రోల్ చేసిన ఆ సినిమాకు కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు కూడా వచ్చాయి.

ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్నది తన ఇంటెన్షన్ కాదని నయన్ క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే, అలాంటి కాంట్రవర్శీలేవీ లేకుండా ఫుల్ థ్రిల్ పంచడానికి రెడీ అయిపోయారు భామాకలాపం 2 మేకర్స్.




