God Concept Movies: దిక్కులేని వారికి దేవుడే దిక్కుని సినిమాలతో ప్రూవ్ చేస్తున్న టాలీవుడ్.!
దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనే మాటను చాలా సార్లు వినే ఉంటాం. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇదే మాట ఇంకాస్త కొత్తగా వినిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీద చిన్న హీరోలకు దేవుడే అండ అంటున్నారు. గాడ్ ఈజ్ గ్రేట్ అనుకుంటూ చాలా మంది ఇప్పుడు ఈ ఫార్ములాకే ఫిక్సయిపోతున్నారు. సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా విడుదలై, వసూళ్ల సునామీని సృష్టించింది హనుమాన్ సినిమా.