Shankar: డైరెక్టర్ శంకర్ ఇంట్లో పెళ్లి బాజాలు.. గ్రాండ్ గా కూతురి నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే?
స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య రెండో వివాహం చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆమె సోదరి ప్రముఖ హీరోయిన్ అదితి శంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అంతేకాదు ఐశ్వర్య ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో కాబోయే దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.