- Telugu News Photo Gallery Cinema photos Famous controversial astrologer Venu Swamy says about why akhil akkineni not getting success
Venu Swamy: అఖిల్‌కు వరుస ప్లాఫుల ఎందుకొస్తున్నాయో చెప్పిన వేణు స్వామి.. హిట్ పడాలంటే అలా చేయాల్సిందేనట
ఒకే ఒక్క సాలిడ్ హిట్. కొడితే బాక్సాఫీస్ దద్దరిల్లిపోవాలి. అలాంటి సాలిడ్ హిట్ కోసం చాలాకాలం నుంచి ట్రై చేస్తున్నాడు అక్కినేని అఖిల్. ప్రతి సినిమాకు రక్తం పెట్టి పని చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఒక్క బ్లాక్ బాస్టర్ హిట్ కూడా దక్కలేదు. తాజాగా ఏజెండ్ కూడా మిక్ట్స్ టాక్ సొంతం చేసుకుంది.
Updated on: Apr 30, 2023 | 7:28 PM

టాప్ డైరెక్టర్స్, క్లాస్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసినా అఖిల్ ఫేట్ మారడం లేదు. సినిమా కోసం అతడు పడే కష్టం కూడా అంతా ఇంతా కాదు. పాత్ర ఏం కోరినా చేసేందుకు వెనకాడటం లేదు. అంత చేసినా ఫలితం మాత్రం నిరుత్సాహపరుస్తుంది.

అయితే అఖిల్ వరుస ఫ్లాపులకు కారణం అఖిల్ జాతకంలో దోషం అంటూ గతంలో జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన కామెంట్స్ ప్రజంట్ వైరల్ అవుతున్నాయి. అఖిల్ జాతకంలో సమస్యలు ఉన్నాయని..అందులో నాగ దోషం ప్రధానమైనదని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.

ఈ దోషం ఉన్న వారు ఇతరుల సలహా తీసుకుంటే వర్కువుట్ అవ్వదని స్పష్టం చేశారు. అఖిల్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే.. అతని సినిమా విషయంలో ఎవరి ఇన్వాల్వ్‌మెంట్ ఉండకూడదని పేర్కొన్నారు. తన సొంతగా స్టోరీని ఓకే చేసి.. సినిమా చేస్తేనే విజయవంతమవుతాడని జోస్యం చెప్పారు.

అఖిల్ జాతకంలో చంద్రుడు నీచంలో ఉన్నాడని.. మదర్ చంద్రుడికి.. పాదర్ సూర్యుడికి సంకేతమని ఆయన అన్నారు. చంద్రుడు నీచంలో ఉండటం వల్ల అఖిల్ సినిమాల విషయంలో అమల గారి ప్రమేయం మంచిది కాదని.. తాను జాతకం ప్రకారమే ఈ మాటలు చెబుతున్నానని అన్నారు.

సినిమా ఇండస్ట్రీలో జాతకాలు, సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో వేణు స్వామి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఆయన వేణు స్వామి కొన్ని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.




