- Telugu News Photo Gallery Cinema photos The Price menu of Nellore Peddareddy Chepala Pulusu in Hyderabad Founded by Kiraak RP See Photos
Chepala Pulusu: చేపల పులుసుతో భారీగా పెరిగిన ఆర్పీ ఆదాయం.. అతడి షాపులో కర్రీ రేట్లు ఇలా ఉన్నాయ్…
నటనకు కొంత గ్యాప్ ఇచ్చిన కిర్రాక్ ఆర్సీ ప్రజంట్ ఫుడ్ బిజినెస్‌తో దూసుకుపోతున్నాడు. నెల్లూరు ట్రేడ్ మార్క్ చేపల పులుసును హైదరాబాద్‌లో విస్తరిస్తున్నాడు. సేమ్ టేస్ట్ కోసం అతడు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు ఆర్పీ.
Updated on: Apr 30, 2023 | 6:17 PM

ఫస్ట్ కూకట్ పల్లిలో షాపు పెట్టాడు ఆర్పీ. ఆ తర్వాత మణికొండ, అమీర్ పేట్‌లలో బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు. ఆర్పీ ఫిష్ కర్రీ దుకాణాల వద్ద రష్ కొనసాగుతుంది. స్వీగ్గీలో ఆన్ లైన్ డెలివరీ కూడా అందుబాటులో ఉంది. టేస్ట్ కోసం నెల్లూరు నుంచి చేపల పులుసు వండటంలో చేయి తిరిగినవారిని తీసుకువచ్చి ఫిస్ క్రీ చేయిస్తున్నాడు ఆర్పీ.

నెల్లూరు స్లైల్లో మామిడికాయ వేసి.. పులుసు చేయిస్తున్నాడు ఆర్పీ. చేపలు కూడా వీలైనంతవరకు అక్కడి నుంచే తెప్పిస్తున్నాడు. కొరమీను పులుసు, బొమ్మిడాయిల పులుసు, సన్న చేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు అతని దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి.

ఆర్పీ చేపల దుకాణాల్లో ధరలు ఎలా ఉన్నయన్న విషయంపై ఇప్పటికీ చాలామందికి క్లారిటీ లేదు. ఆ సమాచారం మీ కోసం పట్టుకొచ్చాం. బొమ్మిడాయిల పులుసు – 375 రూపాయలు, చేప తలకాయ పులుసు – 200 రూపాయలు, కొరమేను పులుసు – 375 రూపాయలు, రవ్వ చేపల పులుసు – 285 రూపాయలు, సన్న చేపల పులుసు 250 రూపాయలు, వైట్ రైస్ – 75 రూపాయలు, రాగి సంగటి – 100 రూపాయలు.

క్వాలిటీ, క్వాంటిటీతో తన చేపల పులుసు కర్రీ పాయింట్ బిజినెస్ నిర్వహిస్తున్నట్లు ఆర్పీ పలు సందర్బాల్లో తెలిపాడు. కట్టెల పొయ్యి మీదే చేపల పులుసు వండుతున్నామని, పార్శిళ్ల విషయంలో ప్లాస్టిక్ వాడటం లేదని స్పష్టం చేశాడు.

ఎవరైనా ఒక కేజీ చేపల పులుసు తీసుకుంటే కవర్లలో కాకుండా కుండలో పెట్టి ప్రత్యేకంగా ప్యాక్ చేసి ఇస్తామన్నాడు. బయటతో పోల్చుకుంటే కాస్త ధరలు ఎక్కవే. అయితే ఆ మందం క్వాలిటీ ఇస్తున్నామంటున్నాడు ఈ కమెడియన్.
