- Telugu News Photo Gallery Cinema photos Do You Know Actress Sneha Net Worth and Remuneration Details
Sneha: అందమైన బుట్టబొమ్మ.. స్నేహ ఆస్తులు ఎన్ని కోట్లు ఉంటాయో తెలుసా.. ? ఇప్పుడేం చేస్తుందంటే..
తెలుగు సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్లలో స్నేహ ఒకరు. ఒకప్పుడు గ్లామర్ షోకు దూరంగా ట్రెడిషనల్ లుక్స్ లో చూడముచ్చటగా కనిపిస్తూనే.. అద్భుతమైన నటనతో కట్టిపడేసిన హీరోయిన్ ఆమె. ఇప్పటికీ దక్షిణాది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.
Updated on: Nov 02, 2025 | 8:56 AM

తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు స్నేహ. తొలివలపు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ అమ్మడు..నాగార్జున, వెంకటేశ్, శ్రీకాంత్ వంటి స్టార్ హీరోలతో అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలలో నటించి జనాలకు దగ్గరైన స్నేహ.. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. తమిళ్ హీరో ప్రసన్న కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. స్నేహకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన స్నేహ, వదిన, అక్క పాత్రలు పోషించింది. రామ్ చరణ్ నటించిన వినయ విదేయ రామ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో పలు కీలకపాత్రలు పోషించింది. ఇటీవలే విజయ్ నటించిన లియో చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషించింది.

కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న స్నేహ.. ఇప్పుడు చీరల వ్యాపారంలో బిజీగా ఉంటుంది. చెన్నైలో స్నేహాలయం పేరుతో షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. నివేదికల ప్రకారం స్నేహ ఆస్తులు రూ.45 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం.

స్నేహ నటించడం ప్రారంభించి 25 సంవత్సరాలు అయింది. ఆమె ఒక్కో సినిమాకు కోటి రూపాయలు సంపాదిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చీరకట్టులో అందమైన ఫోటోషూట్లను నెటిజన్లను ఆకట్టుకుంటుంది స్నేహ. ముఖ్యంగా పట్టుచీరల్లో బుట్టబొమ్మలా కనిపిస్తుంది.




