- Telugu News Photo Gallery Cinema photos Do You Know These Movie Rejected By Pawan Kalyan For This Reason
Pawan Kalyan : ఎంత పనిచేశావన్నా.. పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే.. చేసుంటే మరోలా ఉండేదే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన పవన్.. తన ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నాళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. ఇటీవలే ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
Updated on: Nov 01, 2025 | 8:26 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన పవన్.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలు తగ్గించారు. కొన్నాళ్లుగా సినిమాల్లో సైలెంట్ అయిన పవన్.. ఇప్పుడిప్పుడే వరుస చిత్రాలతో అలరిస్తున్నారు.

గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న పవన్.. ఇటీవలే ఓజీ సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేశారు. డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో అడియన్స్ ముందుకు రానున్నారు.

ఓజీ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే పవన్ తన సినీప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను వదలుకున్నారని మీకు తెలుసా.. ? అయితే అవెంటో తెలుసుకుందామా. పూరీ జగన్నాథ్ , మహేష్ బాబు కాంబోలో వచ్చిన పోకిరీ సినిమాను పవన్ కోసమే రాశారట.

అలాగే మహేష్ బాబు నటించిన అతడు సినిమా సైతం పవన్ చేయాల్సిందట. కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ వదులకున్నారట. అలాగే రవితేజ కెరీర్ మలుపు తిప్పిన ఇడియట్ సినిమకు ఫస్ట్ ఛాయిస్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా కథను పవన్ కోసమే రాసుకున్నారట పూరీ. కానీ అప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ సినిమాను వదులుకున్నారట.

ఇవే కాకుండా రవితేజ నటించిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా కథను ముందుగా పవన్ కళ్యాణ్ కు వినిపించగా.. ఇతర కారణాలతో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారట. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సైతం మహేష్ బాబు పాత్రలో పవన్ నటించాల్సిందట. ఇవే కాకుండా రవితేజ నటించిన మిరపకాయ్ సినిమాను సైతం రిజెక్ట్ చేశారట.




