సౌత్ ఇండస్ట్రీలో మూవీ యూనివర్స్ క్రియేట్ చేసిన తొలి దర్శకుడు లోకేష్ కనగరాజ్. తన ప్రతీ సినిమాను ఒకదానితో మరోదాన్ని కనెక్ట్ చేస్తూ వస్తున్న లోకేష్, ప్రతీ మూవీని ఓపెన్ ఎండింగ్‌తోనే ముగిస్తున్నారు. లియో విషయంలోనూ అలాగే చేశారు ఈ యంగ్ డైరెక్టర్. లియోకు కొనసాగింపు ఉంటుందని, సీక్వెల్‌లో విజయ్ క్యారెక్టర్‌ను రూత్‌లెస్‌గా చూపించబోతున్నట్టుగా గతంలోనే హింట్ ఇచ్చారు.