- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroes are getting ready to entertain the Telugu audience in a different genre
Telugu Heroes: ఇన్నాళ్లు ఒక లెక్క… ఇక నుంచి ఒక లెక్క.. డిఫరెంట్ జానర్‌లో హీరోలు..
కొత్త ఏడాదిలో ఆడియన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు స్టార్స్. ఇన్నాళ్లు ఒక లెక్క... ఇక నుంచి ఒక లెక్క అంటూ డిఫరెంట్ స్ట్రాటజీస్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. సూపర్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు ఈ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. రీ ఎంట్రీలో ఒక్కో సినిమా ఒక్కో డిఫరెంట్ జానర్‌లో ట్రై చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొత్త ఏడాదిలో డిఫరెంట్ మూవీ ట్రై చేస్తున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కూడా కొత్త స్టైల్ ట్రై చేస్తున్నారు.
Updated on: Jan 07, 2024 | 12:09 PM

కొత్త ఏడాదిలో ఆడియన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు స్టార్స్. ఇన్నాళ్లు ఒక లెక్క... ఇక నుంచి ఒక లెక్క అంటూ డిఫరెంట్ స్ట్రాటజీస్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. సూపర్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు ఈ ఫార్ములానే ఫాలో అవుతున్నారు.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కూడా కొత్త స్టైల్ ట్రై చేస్తున్నారు. మాస్ యాక్షన్, క్లాస్ రొమాంటిక్ మూవీస్ చేస్తున్న ప్రభాస్ సడన్‌గా రూట్ మార్చి సైన్స్ ఫిక్షన్, కామెడీ హరర్ జానర్స్ ట్రై చేస్తున్నారు. ఇలా హీరోలంతా కొత్త ఏడాదిలో కొత్త ట్రెండ్‌లోకి వస్తుండటంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొత్త ఏడాదిలో డిఫరెంట్ మూవీ ట్రై చేస్తున్నారు. ఇంతవరకు చేయని సీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ దేవరలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తారక్ లుక్‌తో పాటు, సినిమా థీమ్ కూడా కొత్తగా ఉండబోతుందన్న అంచనాలు ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు మాత్రమే చేస్తున్న వెంకీ కూడా యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశారు. వరుసగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ చేస్తున్న నాగార్జున, నా సామిరంగ అంటూ మాస్ ట్రాక్‌లోకి వస్తున్నారు.

రీ ఎంట్రీలో ఒక్కో సినిమా ఒక్కో డిఫరెంట్ జానర్‌లో ట్రై చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే చాలా కాలం తరువాత ఫాంటసీ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారు. తన కెరీర్‌లో మైల్‌స్టోన్ లాంటి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా ఫాంటసీ జానర్‌లోనే తెరకెక్కింది. ఇన్నేళ్ల తరువాత వశిష్ట దర్శకత్వంలో మరోసారి అదే జానర్‌ను ట్రై చేస్తున్నారు.




